Diwali Festival 2025: హిందువులు దసరా పండుగ సందడి నుంచి ఇంకా బయటకు రాకముందే దీపావళి గురించి చర్చ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలో దీపావళి ఒకటి. ఇటీవల కొన్ని హిందూ పండుగలో గందరగోళం నిలకుంట ఉంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం పండుగలు నిర్వహించాలని భావించడంతో.. ఆయా తిథులు రెండు రోజుల్లో ఉండడంతో పండుగ ఏ రోజు జరుపుకోవాలి? అన్న సందేహం చాలా మందికి వస్తుంది. ఇప్పుడు కూడా దీపావళి పండుగ సందర్భంగా అమావాస్య రెండు రోజుల్లో రాబోతుంది.. దీంతో ఏ రోజు దీపావళి జరుపుకోవాలి? అన్న అయోమయం చాలా మందిలో ఉంది. మరి దీపావళి పండుగ ఎప్పుడు అంటే?
ప్రముఖ పండితుల సంస్థ కాశీ విద్వత్ పరిషత్ అనే సంస్థ తెలుపుతున్న ప్రకారం.. 2025 సంవత్సరంలో అక్టోబర్ 20న దీపావళి పండుగ జరుపుకోవాలని క్లారిటీ ఇచ్చింది. దీపావళి పండుగకు సంబంధించిన ప్రదోషకాలం సాయంత్రం 5.46 నుంచి 8.18 వరకు ఉంటుంది. ఈ సమయంలోనే లక్ష్మీ పూజ నిర్వహించుకోవాలని అంటున్నారు. లక్ష్మీ పూజను రాత్రి 7.08 నుంచి 8.18 మధ్య జరుపుకోవాలి అంటున్నారు. అయితే దీపావళి వేడుకలను ఐదు రోజులపాటు నిర్వహించుకునే వారున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 18న శనివారం ధన త్రయోదశి వేడుకలు నిర్వహించుకోనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 19న నరక చతుర్దశి, 20న దీపావళి, 21న గోవర్ధన పూజ, 22న భాయ్ దూజ్ అనే వేడుకలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ సందర్భంగా నోములు, వ్రతాలు కూడా నిర్వహిస్తారు.
దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా లక్ష్మీ పూజలు చేస్తారు. దీపావళి రోజున రాత్రి శుభ ముహూర్తాన లక్ష్మీదేవికి పూజలు చేయడం వల్ల సంపదతో పాటు, ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. పలు వ్యాపార సంస్థల్లో లక్ష్మీదేవి పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అలాగే ఇళ్లలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ లక్ష్మీ పూజ నిర్వహించే ముందు గణపతి పూజలు నిర్వహిస్తారు. అలాగే ధనానికి అధిపతి అయిన కుబేరుడుని కూడా ఇదే రోజు ప్రత్యేకంగా పూజిస్తారు.
దీపావళి పండుగ సందర్భంగా హిందువులైన ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. చీకటివి, అజ్ఞానాన్ని తొలగించి వెలుగునిచ్చేది దీప మాత్రమే అని భావించి ఇలా ఇంటికి దీపాలతో అలంకరిస్తారు. ఆలయాల్లోనూ దీపాలతో సందడి చేస్తారు. ఇంకా వ్యాపార సంస్థల్లో సాయంత్రం లక్ష్మీ పూజ తర్వాత బాణసంచా పిలుస్తారు. బాణసంచా పేల్చడం ద్వారా వ్యక్తుల్లో ఉత్సాహం ఎలా ఉంటుందని భావిస్తారు. అలాగే శరీరంలో ఉన్న కోపం, రోగం తగ్గిపోతుందని అంటారు. మరికొందరు దీపావళి రోజున తిట్లు దేవతలను స్మరించుకుంటారు. స్మశాన వాటిక లకు వెళ్లి సమాధులను అలంకరిస్తారు. వాటిపై దీపాలను ఉంచి వారి పూర్వీకులను గుర్తు తెచ్చుకుంటారు.
ఇలా దీపావళి పండుగ సందర్భంగా ఆయన వర్గాలు రకరకాల వేడుకలు నిర్వహించుకుంటారు. అయితే ఈరోజున టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు దగ్గరే ఉండాలి. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే వెంటనే దగ్గరలోని ఫైర్ స్టేషన్ కు కాల్ చేయాలి.