karthika Masam 2025: పవిత్ర మాసాల్లో కార్తీకమాసం ఒకటి. దీని ఈ నెలలో కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వల్ల అనేక శుభాలు జరుగుతాయని భక్తులు భావిస్తారు. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో దీపారాధన చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహాలు పొందవచ్చని అంటారు. అందుకే కార్తీక మాసం మొత్తంలో ప్రతిరోజు దీపాలు వెలిగిస్తుంటారు. ఆలయాల్లోనూ కొన్ని ప్రత్యేక రోజుల్లో దీపాలు వెలిగించి దైవ దర్శనాలు చేసుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఎంతో పవిత్రమైనదని భావిస్తారు. ఈరోజు శివుడిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. అలాగే దశమి, ఏకాదశి రోజున శివుడి దర్శనం చేసుకుంటే అనుకున్న పనులు ఉంటాయని భావిస్తారు. ఈ మాసంలో సాధారణ దీపం కాకుండా ఉసిరి దీపాలు వెలిగిస్తే విజయాలు సొంతమవుతాయని అంటారు. అందుకు మహాభారతంలోని ఈ స్టోరీయే నిదర్శనం..
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
కార్తీక మాసంలో దీపారాధన గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ మాసంలో ఉసిరి దీపం వెలిగించడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు. ఉసిరి చెట్టును ఈశ్వరుడి స్వరూపంగా భావిస్తారు. ఉసిరి చెట్టులో సకల దేవతలు నివసిస్తారని.. ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన సకల ఆరోగ్యాలు ఉంటాయని భావిస్తారు. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎందుకంత ప్రాధాన్యం అన్నదానిపై వశిష్ట మహాముని తన శిష్యులకు ఒక పురాణ కథ చెప్పాడు.
పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో కార్తీక మాసం వస్తుంది. ఈ సమయంలో శివ పూజ చేయడానికి ఎక్కడ లింగం కనిపించదు. దీంతో ఏం చేయాలని ద్రౌపతి ఆలోచిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపతికి కొన్ని విషయాలను చెప్తాడు. పాండవులు చేసినా కొన్ని తప్పుల వల్ల ఇలా అరణ్యవాసం రావాల్సి వచ్చిందని.. ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల ఈ దోషాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు చెబుతాడు. అప్పుడు ద్రౌపది ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలో పై పొర తీసేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగిస్తుంది. ఈ దీపం వెలిగించి భోజనం చేసిన తర్వాతే ధర్మరాజు యుద్ధం ప్రకటించారని చెబుతాడు. అంతేకాకుండా పాండవులకు ఉన్న దోషాలు తొలగిపోయి తిరిగి రాజ్యంలోకి వచ్చారని పురాణ కథ తెలుపుతుంది.
అందువల్ల ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో దీపం వెలిగించడం వల్ల ఎన్నో దోషాల నుంచి బయటపడవచ్చు అని పండితుని తెలుపుతున్నారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని అంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం వల్ల నరదృష్టి తొలగిపోతుందని చెబుతున్నారు. అలాగే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు తెలుపుతున్నారు.