Karthika Masam 2024: కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే.. పుణ్యమంతా మీదే!

కార్తీక మాసంలో ఎక్కువగా నదీ స్నానాలు చేస్తారు. అసలు నదీ స్నానాలు ఎందుకు చేస్తారు? నదీ స్నానం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : November 4, 2024 10:32 pm
Follow us on

Karthika Masam 2024: హిందూ పండుగల్లో కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత వేరే. నెల రోజులు పాటు శివుడిని భక్తితో పూజిస్తారు. ఏడాది మొత్తంలో కార్తీక నెలలో ఎక్కువగా పూజలు నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి స్నానాలు చేసి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే కొందరు దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం ఆచరిస్తే.. మరికొందరు పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఆచరిస్తారు. ఏడాది అంతా చేసే పూజలు ఎంత ముఖ్యమో.. కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చాలా ముఖ్యమని పండితులు చెబుతుంటారు. అయితే ఈ కార్తీక మాసంలో చాలా నిష్టతో పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇదిలా ఉండగా కార్తీక మాసంలో ఎక్కువగా నదీ స్నానాలు చేస్తారు. అసలు నదీ స్నానాలు ఎందుకు చేస్తారు? నదీ స్నానం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

 

కార్తీక మాసంలో ప్రతీ ఒక్కరూ భక్తితో నిండిపోయి ఉంటారు. ఈ మాసంలో ఉన్న నెల రోజుల పాటు నదీ స్నానం చేయడం వల్ల మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. సూర్యోదయానికి ముందే వేకువ జామున లేచి నదిలో స్నానం ఆచరించాలి. సాధారణంగా ఈ మాసంలో చలి ఉంటుంది. కానీ నదిలో స్నానం చేసేటప్పుడు అంతగా చలి కూడా అనిపించదు. ఎందుకంటే నదిలో నీరు వేడిగా ఉంటాయి. సహజంగా పారుతున్న నది నీరు శరీరాన్ని ఇంకా వెచ్చగా ఉంచుతుంది. ఈ నీటిని స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న బద్ధకం పూర్తిగా పోతుంది. వర్షాల తర్వాత నీరు స్వచ్ఛంగా మారుతుంది. సాధారణంగా నది నీటిలో ఖనిజాలు, మూలికలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. అందుకే వేకువ జామున నదీ స్నానం చాలా ముఖ్యం. అయితే ఈ కార్తీక మాసంలో చంద్రుడు చాలా శక్తివంతంగా ఉంటారు. చంద్రుని నుంచి వచ్చిన కిరణాలతో నదులు ఔషధంగా మారుతాయి. ఉదయాన్నే ఈ నీటిలో స్నానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.

 

శివుడిని ఎంతో భక్తితో పూజించే ఈ మాసంలో నదీ స్నానం చేసి అక్కడే దామోదర పూజ చేస్తారు. ఈ పూజ చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. దామోదర పూజ అంటే దేవుడి ఫొటో పెట్టి పూజ చేయరు. స్నానం చేసి నదిలోని ఇసుకను తీసుకొచ్చి దానిపై ముగ్గులు వేసి, దీపాలు పెట్టి పూజిస్తారు. అయితే కేవలం నదుల్లో మాత్రమే స్నానం చేయకుండా చెరువులు, సముద్రాల్లో కూడా చేయవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది బయట కంటే ఇంట్లోనే ఎక్కువగా స్నానం ఆచరిస్తున్నారు. కార్తీక నెల మొత్తం ఇలా శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతా మంచే జరుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే చాలా మంది ఎంత కష్టమైన కార్తీక నెలలో తప్పకుండా పూజలు నిర్వహిస్తారు. ఈ నెలలో పూజలు చేయడం వల్ల శివుడి అనుగ్రహంతో పాటు సకల దేవతలు అనుగ్రహం కలుగుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలకు పండితులను సంప్రదించండి.