Kamala Harris: నా వ్యతిరేకులు కూడా మిత్రులే.. యుద్ధానికి త్వరలో ముగింపు.. కమల కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకునర్నాయి. కొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. దీంతో అభ్యర్థులు తుది ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కమలా హారిస్‌ యుద్ధం గురించి మాట్లాడారు.

Written By: Raj Shekar, Updated On : November 4, 2024 2:45 pm

Kamala Harris

Follow us on

Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం(నవంబర్‌ 5న) జరుగనున్నాయి. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఈ తరుణంలో అభ్యర్థులు తుది ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రంప్‌ వలసల కట్టడికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఇక డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ కూడా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వ్యతిరేకించేవారిని కూడా మిత్రులే అన్నారు. వారిని శత్రువుగా చూడడని స్పష్టం చేశారు. మిషిగాన్‌లోని ఈస్టనింగ్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. తోలి అమెరికన్లను శత్రువుగా చూడడం వంటి నూతన స్థితి ప్రారంభానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎవరిని పడదోయాలో తెలిసిన వ్యక్తిగా కాకుండా.. ఎవరిని పైకి తీసుకురావాలో తెలిసిన వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు అమెరికన్లు సిద్ధమయ్యారని తెలిపారు. విచ్ఛిన్న రాజకీయాల పేజీని తిప్పేయాలని కోరారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తనను వ్యతిరేకించిన వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తానని తెలిపారు. బలమైన నాయకులు అదే చేస్తారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు అమెరికన్ల జీవితంలో ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు.

యుద్ధానికి ముగింపు..
ఇక తాను అధ్యక్షరాలు అయితే.. గాజా యుద్ధాన్ని ముగిస్తానని తెలిపారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల భద్రతను కూడా కాపాడతామని తెలిపారు. గతంలో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ప్రచారం చేసిన పాలస్తీనా మద్దతుదారుల నంంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇలా వారిని మచ్చిక చేసుకునేందుకు కమలా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గాజాలో ఈ ఏడాది అత్యంత కఠిన పరిస్థితులు నెలకొన్నాయని, తాను అధ్యక్షరాలు అయితే యుద్ధం ముగించడానికే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. హమాస్‌ బందీలను క్షేమంగా ఇంటికి చేరుస్తామని తెలిపారు.

స్వింగ్‌ స్టేట్లో చివరి ప్రచారం..
ఇక అభ్యర్థులు ఇద్దరూ తమ చివరి ప్రచారానికి స్వింగ్‌ స్టేట్స్‌నే ఎన్నుకున్నారు. ట్రంప్‌ నార్త్‌ కరోలినాలో ప్రచారం చేయగా, కమలా హారిస్‌ మిషిగాన్‌లో తన చివరి ప్రచారం చేశారు. కమలా ప్రచారానికి భారీగా జనం హాజరయ్యారు. ఈ రాస్ట్రాన్ని దక్కించుకునే ఎన్నికల్లో గెలపు ఈజీ అని కమలా హారిస్‌తోపాటు డెమోక్రాట్లు భావిస్తున్నారు.