Canada : ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్యను అడ్డం పెట్టుకుని భారత్‌ను విశ్వ వేదికపై దోసిగా నిలబెట్టేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రయత్నిస్తున్నారు. ఇందుకు భారత వ్యతిరేక దేశాలను కూడగట్టుకుంటున్నారు. భారత ఎదుగుదలను ఓర్వలేని దేశాలు నెనడాను రెచ్చగొడుతున్నాయి. ఈ క్రమంలో ట్రూడో స్వామి కార్యంతోపాటు స్వకార్యం నెరవేర్చుకునే పనిలో పడ్డారు. వచ్చే ఏడాది జరిగే కెనడా ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు ఆ దేశంలో 7 శాతం ఉన్న సిక్కుల మద్దతు కోసం భారత్‌పై పదే పదే నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. భారత్ గురించి అమెరికా మీడియాకు లీకేజీలు ఇస్తున్నారు. ఈ క్రమంలో భారత్–కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాదులు ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు. తాజాగా కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం లక్ష్యంగా దాడులు చేశారు. భక్తులపైనా దాడి చేశారు. దీనిని ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా పరిగణించారు. తమ దేశంలోని ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని పేర్కొన్నారు. ఈ దాడులు ఏమాత్రం మంచిది కాదన్నారు. వెంటనే బ్రాంప్టన్‌లోని ఆలయం వద్ద భద్రతను పటిష్టం చేశారు. ఈ ఘటపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
వీడియో వైరల్…
ఇదిలా ఉంటే.. ఆలయం కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పీల్ రీజినల్ పోలీస్ విభాగం ప్రతినిధి మాట్లాడారు. తాము ఇంత వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. ఘర్షణలకు కారణాలు చెప్పలేకపోయారు. ఈ దాడులపై కెనడా ప్రతిపక్ష నేత, కన్జర్వేటివ్ పార్టీ నేత ప్రియర్రె పొయిలీవ్రే స్పందించారు. అందరి మత విశ్వాసాలను పాటించే స్వేచ్ఛ ఉండాలన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గందరగోళ పరిస్థితులకు ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు. మరోవైపు కెనడా ఎంపీ చంద్రార్య స్పందిస్తూ కెనడాలో ఎంత తీవ్రస్థాయిలో హింసాత్మక తీవ్రంఆదం పెరిగిపోయిందో తెలియడానికి ఈ ఘటన నిదర్శనమని తెలిపారు. కెనడాలో హిందువుల ముందుకు వచ్చి తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. కెనడాలో తీవ్రవాద శక్తులు రాజకీయాల్లోకి, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాల్లోకి కూడా చొరబడ్డాయని ఆరోపించారు. దాడులపై ఎంపీ కెవిన్ వూంగ్ స్పందిస్తూ తీవ్రాదులకు క ఎనడా సురక్షిత ప్రదేశంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. హిందువులు, క్రిస్టియన్లు, యూదులతను రక్షించడంలో కెనడా నాయకులు విఫలమయ్యారని విమర్శించారు.
చర్యలకు హామీ..
ఇదిలా ఉంటే.. దాడులు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని బ్రాంప్లన్ మేయర్ పాక్ర్ బ్రౌన్ హామీ ఇచ్చారు. మత స్వేచ్ఛ అనేది కెనడాలో మౌలిక విలువకు చిహ్నమని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి ప్రార్థనా మందిరాల వద్ద సురక్షితంగా ఉండాలని సూచించారు. ఒంటారియో సిబ్స్ అండ్ గురుద్వారా కౌన్సిల్ కూడా ఈ హింసను ఖండించింది. హింసకు తమ మతంలో స్థానం లేదని తెలిపింది. దీనిపై అధికారుఉల దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరింది.
హైకమిషన్ ఆందోళన..
ఇదిలా ఉంటే బ్రాంప్‌టన్‌లోని హిందూ ఆలయం వెలుపల నిర్వహిస్తున్న కాన్సులర్ క్యాంప్‌పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేయడాన్ని ఒట్టావాలోని ఇండియన్ హైకమిషన్ ఖండించింది. దీని వెనుక భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆరోపించింది. గతంలో మాదిరిగానే ఒట్టావాలోని హైకమిషన్, వాంకోవర్, టోరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సాధారణ కార్యకలాపాల నిమిత్తం క్యాంపులను నిర్వహిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో భద్రత పెంచాలని కెనడా అధికారులు కోరారు.