Mavullamma Vari Temple: ప్రస్తుతం చదువులు, ర్యాంకులు అంటూనే లైఫ్ చాలా గడిచిపోతుంది. అందరికీ ఈ చదువుల గురించి చాలా టెన్షన్ పెరిగిపోయింది. అయితే చాలామంది చదువులో వెనకబడుతు ర్యాంకులు సాధించలేక ఆత్మ న్యూనత కు బాధపడుతున్నారు. అంతేకాదు ఫెయిల్ అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఓ గుడికి వెళ్తే మీ పిల్లలకు చదువు బాగా వస్తుందట.
ఇప్పుడు మనం తెలుసుకోబోయే గుడి మావుళ్ళమ్మ అమ్మవారి గుడి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో ఈ తల్లి కొలువై ఉంది. 9 దశాబ్దాల క్రితమే వెలసింది అమ్మవారు. శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతూ..అడిగిన కోర్కెలు తీరుస్తుంది. 1880 లలో వైశాఖమాసం రోజుల్లో భీమవరంలో అమ్మవారి వెలిశారని చెబుతుంది చరిత్ర. గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించే తాను వెలసిన ప్రాంతాన్ని చెప్పిందట. ఆ తర్వాత అమ్మ చెప్పిన ప్రాంతం లో వెతకగా అమ్మవారి విగ్రహం లభించిందట. అంతేకాదు అమ్మవారి విగ్రహం ఉన్నచోట దీపాలు వెలుగుతూ కనిపించాయట.
అమ్మ తెలిపిన వరకు చిన్న పాక వేసి ఆలయాన్ని నెలకొల్పారు. మామిడి తోటలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో అమ్మవారు వెలసింది కాబట్టి తొలినాళ్లలో మావిళ్లమ్మగా పిలిచారు. వాడుకలో అది కాస్త మావుళ్ళమ్మగా మారిపోయింది. అమ్మవారికి దసరా సమయంలో ఒకసారి, సంక్రాంతి సమయంలో ఒకసారి జాతరలు జరుగుతుంటాయి. ఉత్సవాల చివరి రోజున సుమారు లక్ష మందికి అన్న ప్రసాదం చేస్తారు. ఈ ఆలయానికి వస్తే పిల్లలకు బాగా చదువు వస్తుందని నమ్ముతారట అక్కడి ప్రజలు.
జీవితంలో ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని నమ్ముతారు భక్తులు. జేష్ఠ మాసంలో నెలరోజుల పాటు గ్రామ జాతర నిర్వహిస్తారు ఊరి ప్రజలు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకు ఒక అవతారంలో అలంకరిస్తారట. ప్రతిరోజు లక్ష కుంకుమార్చన, చండీ హోమం వంటి పూజలతో ఆ ప్రాంతం విరసిల్లుతుంది. అప్పుడు కేవలం భీమవరం నుంచి మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.