https://oktelugu.com/

Rameswaram Cafe: ఆ ప్రాంతానికి వెళ్తే కచ్చితంగా ఆ కేప్ కు వెళ్తారు? దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

రామేశ్వరం కేప్ అంత ఫేమస్ అన్నమాట. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో దీనికి సంబంధించిన బ్రాంచ్ ఓపెన్ చేశారు. అసలు ఎందుకు ఇంత ప్రత్యేకత? అక్కడ ఎలాంటి పదార్థాలు ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 6, 2024 / 02:20 PM IST

    Rameswaram Cafe:

    Follow us on

    Rameswaram Cafe: కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఫేమస్ ప్రాంతాలు ఉంటాయి. అక్కడికి వెళ్తే చాలు ఆ ప్రదేశాన్ని మిస్ చేయవద్దు అనుకునే వారు చాలా మంది ఉంటారు. ఇలాంటి వాటిలో హోటల్స్ కూడా ఉంటాయి. మన హైదరాబాద్ లో అలాంటివి చాలానే ఉన్నాయి. బెంగళూరులో కూడా అలాంటి ఓ హోటల్ ఉంది. అదే రామేశ్వరం కేఫ్. బెంగళూరు వెళ్లి, రామేశ్వరం కేఫ్ గురించి అడిగితే ఎవరైనా చెబుతారు.

    రామేశ్వరం కేప్ అంత ఫేమస్ అన్నమాట. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో దీనికి సంబంధించిన బ్రాంచ్ ఓపెన్ చేశారు. అసలు ఎందుకు ఇంత ప్రత్యేకత? అక్కడ ఎలాంటి పదార్థాలు ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ కేప్ ను 2021 ఓపెన్ చేశారు. దివ్య రాఘవేంద్రరావు అనే వ్యక్తికి వచ్చింది ఈ ఆలోచన. ఇక్కడ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ వంటలు, కాఫీ, టీ ఎక్కువగా లభిస్తాయి.

    మొదటి ఈ బ్రాంచ్ ను బెంగళూరులో ఓపెన్ చేశారు. అంతేకాదు ఈ కేఫ్ కి ఆ పేరు పెట్టడం వెనుక కూడా ఒక కథ ఉంది. ఎంతో గుర్తింపు సంపాదించిన ఓ గొప్ప వ్యక్తి అక్కడ పుట్టారు. ఆయన గొప్పదనానికి నిదర్శనంగా ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే మీకు అర్థం అయింది అనుకుంట. అదేనండి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈయన పుట్టింది రామేశ్వరంలోనే. అందుకే ఈ కేఫ్ కి ఆయన పేరు పెట్టారట. అయితే దివ్య రాఘవేంద్రరావు ముందు, “ఈ వ్యాపారం చేస్తానంటే ఇంట్లో వారు కూడా ఒప్పుకోలేదట. చదువుకోకుండా వ్యాపారం ఏంటి అని వద్దన్నారట.

    కానీ ప్రస్తుతం ప్రముఖులు కూడా బెంగళూరుకి వెళ్ళినప్పుడు రామేశ్వరం కేఫ్ కి వెళ్తారు. ఇక్కడ నాణ్యత పరిమాణాలు ఉన్నతమైన స్థాయిలో ఉండటంతో అవార్డులు కూడా వచ్చాయట. అంతగా ప్రాచుర్యం పొందడంతో, వారి సేవలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. ఈ బ్రాంచ్ హైదరాబాద్ కు రావడంతో ఎంతో మంది రామేశ్వరం కేఫ్ లో పదార్థాలు రుచి చూడడానికి వెళుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్ లు ఓపెన్ చేయాలని చూస్తున్నారట.