Buddha Purnima 2024: బుద్ద పూర్ణిమ నాడు ఇలా చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి..

బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధ విగ్రహాన్ని కొని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచి జరుగుతుందట. దీని వల్ల కుటుంబంలో ఆనందం, శాంతిని తెస్తుంది. అంతేకాదు ఈ రోజున ఆవులను కొని ఇంటికి తీసుకురావచ్చు.

Written By: Swathi, Updated On : May 23, 2024 1:34 pm

Buddha Purnima 2024

Follow us on

Buddha Purnima 2024: బుద్దుడి గురించి మీరు చాలా విషయాలు తెలుసుకునే ఉంటారు. ఇక ఈయన పేరు మీదుగా ఏకంగా బౌద్ధమతం ఉందనే విషయం కూడా తెలిసిందే. అయితే బౌద్ధమతంలో బుద్ధ పూర్ణిమ ఒక ముఖ్యమైన పండుగగా నిర్వర్తిస్తారు. దీనిని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రజలు. ఈ సంవత్సరం బుద్ధ పూర్ణిమ 2024 మే 23 న వచ్చింది. అంటే ఈ రోజే. గౌతమ బుద్ధుడు విష్ణువు అవతారంగా ఈ రోజున జన్మించాడని, ఈ రోజున బోధి చెట్టుకింద జ్ఞానోదయం పొందాడని విశ్వసిస్తారు ప్రజలు.

అయితే ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అందులో మూడు ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు ప్రత్యేకతల్లో మొదటిది అతని జననం, రెండవది జ్ఞానం సంపాదించడం, మూడవది మోక్షం పొందడం. ఇలా వరసగా మూడు కూడా అన్నీ ఒకే రోజున వస్తాయి.అందుకే ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజు వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ కాబట్టి కొన్ని వస్తువులను కొనడం కూడా మంచిది. కొన్ని వస్తువులు ఈ రోజు కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది అని నమ్ముతారు.

బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధ విగ్రహాన్ని కొని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచి జరుగుతుందట. దీని వల్ల కుటుంబంలో ఆనందం, శాంతిని తెస్తుంది. అంతేకాదు ఈ రోజున ఆవులను కొని ఇంటికి తీసుకురావచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆశీసులు ఉంటాయట. అంతేకాదు సంపద పెరుగుతుంది అంటారు పండితులు. ఇక మరో విషయం ఏంటంటే..పూర్ణిమ రోజున బట్టలు కొనడం శుభప్రదం, మీరు పింక్ లేదా ఎరుపు రంగు దుస్తులను కొనుగోలు చేయడం వల్ల మరింత మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ రంగులు లక్ష్మీదేవికి చాలా ప్రీతి.

అయితే బుద్ధ పూర్ణిమ నాడు వెండి నాణెం కొనడం కూడా మంచిది. లక్ష్మీదేవి ఆరాధనలో కూడా దీనిని ఉపయోగిస్తారు భక్తులు.అంతేకాదు ఈ రోజు వెండిని కొనుగోలు చేయడం వల్ల అదృష్టం వస్తుందని, లక్ష్మీదేవిని ప్రసన్నురాలు అవుతుందని చెబుతారు పండితులు. ఇక ఈ రోజు ఇత్తడి ఏనుగును కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది పేదరికాన్ని తొలగించి కుటుంబంలో సంతోషాన్ని, శాంతిని చేకూరుస్తుందట. ఈ రోజు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం మరీ మంచిది. నీరు, చెప్పులు, గొడుగులు, పండ్లు, ఫ్యాన్, మట్టి కుండ వంటివి ధానం చేయాలి.