Pitambaram Ammavaru : సమస్యలున్న వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే పరిష్కారం అవుతాయి..

అయితే ఈ ఆలయంలో అమ్మవారితో పాటు మహదేవుడు, ధూమావతి విగ్రహాలు కూడా ఉన్నాయి. వీరిని హారతి సమయంలో మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన సమయాల్లో ఆలయం తెరిచి ఉండదు.

Written By: NARESH, Updated On : May 20, 2024 10:19 pm

Pitambaram Ammavaru

Follow us on

Pitambaram Ammavaru : ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు. వీటిని పరిష్కరించుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ దైవబలం తోడుంటే కాదనేది ఉండదు. అందుకే కొందరు దేవతలు భక్తుల కష్టాలను తీర్చడానికి పలు ఆలయాల్లో కొలువై ఉన్నారని పండితులు చెబుతూ ఉంటారు. కొందరు కోర్టు కేసుల్లో ఇరుక్కొని సతమతమవుతూ ఉంటారు.ఈ కేసులు సంవత్సాలు గడిచినా పరిష్కారం కావు. అయితే ఈ ఆలయాన్ని దర్శిస్తే సాధ్యమైనవంత వరకు పరిష్కారం అవుతుందని భక్తులు అంటున్నారు. ఆ ఆలయం ఎక్కడుందంటే?

మధ్యప్రదేశ్ లోని పీతాంబరం అమ్మవారం ప్రసిద్ద సిద్ధపీఠం గా కొనసాగుతున్నారు. సంవత్సానికి పూర్వం నుంచే ఈ ఆలయం ఉంది. ఈ అమ్మవారి గుడికి కిటికీ మాత్రమే ఉంటుంది. ఎటువంటి తలుపులు ఉండవు. ఆ కిటీకీ ద్వారానే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. బగళాముఖీ దేవీ గా భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు ఒకప్పుడు శత్రువులపై పోరాడారని స్థానిక భక్తులు తెలుపుతున్నారు. అధికారం కోసం కొందరు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అంటున్నారు.

అయితే సిద్ధపీఠంలోని అమ్మావారిని దర్శించుకొని పసుపు హారతిని సమర్పించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే ఎంతో కాలంగా కొట్టుమిట్టాడుతున్న కోర్టు కేసులు వెంటనే పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. అమ్మవారు మూడు కాలాల్లో మూడు రూపాల్లో దర్శనమిస్తారు. ఉదయం ఒక రూపం, మధ్యాహ్నం మరో రూపం, సాయత్రం ఇంకో రూపంలో దర్శనమిస్తారు. అయితే అమ్మవారు ఇలా ఎందుకు మారుతున్నారని ఎవరికీ అంతుబట్టడం లేదు.

కొందరు పరిశోధకులు సైతం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అయితే అమ్మవారి మహిమ కారణంగానే ఇలా మూడు రూపాల్లో దర్శనమిస్తున్నారని కొందరు భక్తులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆలయంలో అమ్మవారితో పాటు మహదేవుడు, ధూమావతి విగ్రహాలు కూడా ఉన్నాయి. వీరిని హారతి సమయంలో మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన సమయాల్లో ఆలయం తెరిచి ఉండదు.