Horoscope Today: ఈ రాశి వారు ఆంజనేయుడి అండతో విజయాలు పొందుతారు..

2024 మే 21 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : May 21, 2024 7:52 am

horoscope lord hanuman

Follow us on

Horoscope Today: 2024 మే 21 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ఓ రాశి వారికి హనుమాన్ అండదండలు ఉంటాయి. దీంతో అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు. రాబోయే రోజుల్లో లాభాలకు ఇప్పుడు పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. పాత సమస్యలను పెండింగులో పెట్టొద్దు.

వృషభ రాశి:
ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. విద్యార్థులు భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు. కొన్ని పనుల్లో అనూహ్య విజయాలు సాధిస్తారు.

మిథున రాశి:
కుటుంబంతో సమయాన్ని వెచ్చిస్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని కోసం కష్టపడుతూ ఉంటారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

కర్కాటక రాశి:
వ్యాపరస్థులకు అనుకూల సమయం. పెట్టుబడులు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేయాలి.

సింహారాశి:
రోజూ వారీ పనులపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయాలి.

కన్య రాశి:
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు శుభవార్త వింటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉంటారు.

తుల రాశి:
మనసులో వచ్చే ఆలోచనలను నియంత్రించుకోవాలి. కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చిక రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆదాయం, ఖర్చలు సమపాళ్లలో ఉండాలి.

ధనస్సు రాశి:
బావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కొన్నింటికి దూరంగా ఉండి ప్రశాంతమైన వాతావరణం గడపాలి. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం పెరగడంతో సంతోషంగా ఉంటారు.

మకర రాశి:
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా బలోపేతం అవుతారు. భవిష్యత్ కోసం సరైన మార్గంలో పెట్టుబడులు పెడుతారు. కొన్ని విషయాల్లో ఓపిక అవసరం.

కుంభరాశి:
ఈ రాశి వారు ఈ రోజు అంకిత భావంతో పనిచేస్తారు. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది.

మీనరాశి:
కుటుంబ సమస్యల కారణంగా నిరాశతో ఉంటారు. ఆర్థిక విషయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఖర్చులను నియంత్రించడానికి ప్లాన్ వేస్తారు.