హిందూ శాస్త్రం ప్రకారం ఒక్కో దేవుడికి ఒక్కో రోజు పూజ చేయడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ భగవంతుడిని ప్రార్థించడం వల్ల అన్ని మంచి ఫలితాలే ఉంటాయి. అయితే అన్ని రోజుల్లో ప్రత్యేక పూజలు చేయడం సాధ్యం కాదు. కొన్ని ప్రత్యేకమైన రోజులను ఆధ్యాత్మికవాతావరణంలో గడపడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. జీవితంలో కష్టాలు కావాలని ఎవరూ కోరుకోరు. అనుకోకుండా వచ్చిన ఈ బాధలు తొలగిపోవాలని దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
అన్ని బాధలను తొలగొట్టే భగవంతుడు హనమంతుడు అని అంటారు.ఆ ఆంజనేయుడిని ప్రతి మంగళ, శనివారాల్లో ప్రత్యేకంగా కొలుస్తారు. మంగళవారం ఎక్కువ మంది భక్తులు హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో హనుమంతుడికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల మరింత మేలు జరుగుతాయని అంటున్నారు. అవేంటంటే?
హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. మంగళవారం రోజున తమలాపాకుల మాల లేదా కొన్ని తమలా పాకులు దేవుడికి సమర్పించడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు. హనుమంతుడు నిత్యం వేడితో ఉంటారు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఊగిపోతారు. ఈ తరుణంలో తమలాపాకుతు సమర్పించి చల్లబర్చడం వల్ల ఆ స్వామి వారి అనుగ్రహం పొందవచ్చని అంటున్నారు.
మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లినప్పుడు నైవేద్యంగా జిలేబిని సమర్పించడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. జిలేబీ ఆంజనేయస్వామికి సమర్పించడంవల్ల ఎంతో సంషిస్తాడట. అందువల్ల నైవేద్యంగా జిలేబిని తప్పకుండా సమర్పించాలి. అలాగే వడలు కలిగిన మాల వేసినా ఆ మారుతి ఎంతో ఆనందిస్తాడని కొందరు పండితులు చెబుతున్నారు. ఎవరికి వీలైనంత వారు ఆ దేవుడికి సమర్పించుకోవచ్చని తెలుపుతున్నారు.
చాలా మంది హనుమాన్ ఆలయానికి వెళ్లి ఊరికే వస్తారు. వీలైతే మంగళవారం రోజున కొబ్బరికాయ కొట్టే లా ప్రయత్నించండి. కనీసం 11 మంగళవారాలు కొబ్బరికాయను సమర్పించడం వల్ల ఆంజనేయుడు కరుణిస్తాడని అంటున్నారు. మనిషిలోని కొన్ని చెడు గుణాలను కొబ్బరి కాయ సమర్పించడం వల్ల తొలగించుకోవచ్చని అంటున్నారు. అలాగే ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని అయినా పాలద్రోలవచ్చని అంటున్నారు.