Nagula Chavithi: హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని పండుగ రోజుల్లో మాత్రమే కాకుండా ప్రత్యేక రోజుల్లో కూడా పూజలు నిర్వహిస్తారు. మనదేశంలో నాగుపాములను దేవుళ్ళుగా కీర్తిస్తారు. ప్రతి ఏడాది నాగుల పంచమి, నాగుల చవితి రోజున సర్ప రాజులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రావణమాసంలో నాగుల పంచమి రాగా.. కార్తీక మాసం నాలుగవ రోజున నాగుల చవితి వేడుకలను నిర్వహించుకుంటారు. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం వల్ల సంతానం కలుగుతుందని నమ్ముతారు. అలాగే కుటుంబ శ్రేయస్సు కూడా ఉంటుందని భావిస్తారు. అయితే నాగేంద్రుడి ఆశీస్సులు పొందడానికి నాగుల చవితి రోజు ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి?
నాగుల చవితి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నాన ఆచరించాలి. దంపతులు ఇద్దరు కలిసి సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లి పుట్టకు ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే నైవేద్యంగా పెరుగు, చక్కెర, బెల్లం కలిపిన పంచామృతం సమర్పించాలి. శివాలయాల్లో ఉన్న నాగేంద్ర స్వామి విగ్రహాలకు అభిషేకం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని అంటారు. అలాగే నాకు పాము పుట్ట వద్ద పూలు లేదా పండ్లు సమర్పించడం వల్ల నాగేంద్ర స్వామి సంతోషిస్తాడని భావిస్తారు.
నాగేంద్ర స్వామికి నాగుల చవితి రోజున పూజలు చేయడం వల్ల ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయని భావిస్తారు. నాగుపాము నివసించే పుట్టకు పాలు పోయడం వల్ల కుజదోషం, కళత్ర దోషం, కాలసర్ప దోషం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. నాకు పాము పుట్టలో పాలు పోసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయడం వల్ల ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. ఈరోజు పాము పుట్టకు పాలు పోయడమే కాకుండా రోజంతా ఉపవాసం ఉండడంవల్ల కూడా అనుకున్న పనులు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నాగేంద్ర స్వామి శిలకు అభిషేకం చేసే సమయంలో ఓం నమో భగవతే వాసుకేయ నమః, ఓం నమో భగవతే అనంతయ నమః, ఓం నమో భగవతే శేషనాధాయ నమః అనే మంత్రాలు జపించడం వల్ల ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని అంటున్నారు. ఈ మంత్రాలను పునరావృతం చేస్తూ ధూప, దీపారాధన చేయాలి.
అయితే నాగుల చవితి రోజున కొన్ని పనులు చేయకుండా ఉండాలి. ఈ రోజున ఎక్కడైనా పాము కనిపిస్తే కొట్టకుండా ఉండాలి. ఈరోజు గుణపంతో భూమిని తవ్వకుండా ఉండాలి. ఈరోజు ఉపవాసం ఉన్నవారు నూనెతో కూడిన వస్తువులు తినరాదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలను వాడరాదు. పుట్టలో పాలు పోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.