SBI credit card holders: బ్యాంకుతో ఆర్థిక వ్యవహారాలు జరిపే వారికి క్రెడిట్ కార్డ్ తప్పనిసరిగా ఉంటుంది. ఇందులోను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చాలామంది క్రెడిట్ కార్డు తీసుకున్నారు. ఈ క్రెడిట్ కార్డుతో వివిధ అవసరాలను తీసుకుంటున్నారు. కొందరు ఆన్లైన్ సేవలు.. మరికొందరు స్వైపింగ్తో షాపింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు SBI క్రెడిట్ కార్డు ఖాళీ ఉన్నవారు కొన్ని సేవల్లో ఎలాంటి రుసుములో చెల్లించాల్సిన అవసరం రాలేదు. కానీ తాజాగా ఈ బ్యాంకు యజమాన్యం కస్టమర్లపై అదనంగా చార్జీలు విధించనుంది. ఈ చార్జీలు నవంబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి చార్జీలు విధిస్తుంది అంటే?
క్రెడిట్ కార్డు ఉన్నవారు మొబైల్ లోని యూపీఐ కి కనెక్ట్ చేసుకొని బిల్లులు చెల్లిస్తూ ఉంటారు. అయితే కొన్ని చెల్లింపుల్లో నేరుగా క్రెడిట్ కార్డుతో లింకు చేసుకొని మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. మరికొందరు క్రెడిట్ కార్డు లోని లిమిట్ నుంచి ఫోన్ పే లేదా గూగుల్ పే వాలెట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత బిల్లులు చెల్లిస్తారు. అయితే ఇప్పటివరకు ఇలా వాలెట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఎలాంటి చార్జీలు విధించేవారు కాదు. కానీ ఇకనుంచి రూ.1000 కి పైగా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే 1 శాతం ఫీజు వసూలు చేస్తారు. ఉదాహరణకు రూ.5,000 క్రెడిట్ కార్డ్ నుంచి మనీ వాలెట్లోకి పంపిస్తే రూ.50 చార్జ్ వేస్తారు. అయితే రూ.1000 లోపు మాత్రం ఎలాంటి చార్జీలు వర్తించవు.
అంతేకాకుండా విద్యాసంస్థలకు ఇప్పటివరకు థర్డ్ పార్టీ యాప్ ద్వారా ఫీజులు తెలిస్తే ఎలాంటి రుసుము ఉండేది కాదు. కానీ ఇకనుంచి రూ.1 శాతం అదనపు చార్జీలను వసూలు చేయనున్నారు. అయితే నేరుగా పాఠశాల లేదా కళాశాల లకు సంబంధించిన వెబ్ సైట్ ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా బిల్లులు చెల్లింపు చేస్తే ఎలాంటి చార్జీలు పడవు. కానీ క్రెడిట్ లేదా మోబిక్విక్ వంటి వాటి ద్వారా స్కూల్, కాలేజీ ఫీజులు చెల్లించినా కూడా రూ.1 శాతం అదనంగా ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉందని కొందరు అంటున్నారు. కొందరు థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించి దుర్వినియోగ పరుస్తున్నారని.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్ణయం తీసుకోవడం వల్ల స్కూల్ ఫీజు చెల్లించే వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే ఫోన్ వాలెట్లోకి మనీ లోడ్ చేసి చెల్లించేవారు కూడా ఇకనుంచి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.