Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తలపెట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆగస్టు నెలలో 13 వేలకు పైగా గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలను నిర్వహించి ప్రజల చేత తీర్మానించబడిన 30 వేల అభివృద్ధి పనులకు నేడు పవన్ కళ్యాణ్ కంకిపాడులో శంకుస్థాపన చేసాడు. నేటి నుండి 20వ తేదీ వరకు ప్రతీ గ్రామం లోను సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, పాఠశాలల్లో రూఫ్ టాప్స్, గోశాల నిర్మాణాలు, ప్రతీ గ్రామంలోను స్వచ్ఛమైన త్రాగు నీరు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు అధికారులు. సంక్రాంతి లోపు ఈ కార్యక్రమాలు పూర్తి అవ్వాలని, జనవరి 23 వ తారీఖున మరోసారి గ్రామసభలను 13 వేల గ్రామాల్లో ఏర్పాటు చేసి మరికొన్ని సమస్యలకు ప్రజల చేత తీర్మానం చేయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులకు ఈ సభ ద్వారా ఆదేశాలు జారీ చేసాడు.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ప్రతీ సభలోను అభిమానుల కోలాహలం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ‘సీఎం..సీఎం’ అంటూ సభా ప్రాంగణాన్ని దద్దరిల్లిపోయేలా చేసేవారు. కానీ ఉపముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడికి వెళ్లినా ఇప్పుడు ‘ఓజీ..ఓజీ’ అంటూ నినాదాలు చేస్తున్నారు. నేడు ఏర్పాటు చేసిన కంకిపాడు ‘పల్లె పండుగ’ సభలో కూడా అభిమానులు ‘ఓజీ..ఓజీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.
దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘మీరు ఓజీ..ఓజీ అని అరిచినప్పుడల్లా నాకు మోడీ..మోడీ అని వినిపించేది. మీ అందరికీ వినోదం కావాల్సిందే, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఈ పల్లె పండుగ ముఖ్య ఉద్దేశ్యాన్ని మీరంతా గమనించాలి. నా అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా వాళ్ళ అభిమాన హీరోలకు సంబంధించిన సినిమాలకు టికెట్స్ కొని చూసేందుకు డబ్బులు ఉండాలి. ముందు అందరి కడుపు నిండాలి, ఆ తర్వాతనే వినోదం. అందుకే ముందు కడుపు నింపే కార్యక్రమాలు చేసుకుందాం. మన రోడ్లు, స్కూళ్లను నిర్మించుకుందాం, ఆ తర్వాతే మనకి విందులు, వినోదాలు, ఓజీలు. కనీసం మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూసేందుకు అయినా రోడ్లు బాగుండాలి కదా. నేను ఇండస్ట్రీ లో ఏ హీరోతో కూడా పోటీ పడను. చిరంజీవి,బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని ఇలా ప్రతీ ఒకరు ఎదో ఒక ప్రతిభ లో నిష్ణాతులు, వీళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాను. మీ అభిమాన హీరోల సినిమాలకు వెళ్లి జై కొట్టేలా ఉండాలంటే మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుండాలి, ఆ దిశగా ముందు అడుగులు వేద్దాం’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒకపక్క ఉపముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలపై ద్రుష్టి సారిస్తూనే, మరోపక్క ‘హరి హర వీరమల్లు’ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్.
@APDeputyCMO Mentioned All Heroes in His Speech ❤️
You Trolled Him, You Backstabbed Him , But He Continuosly Respects Your Hero & Entertainment
కలముషం లేని వ్యక్తి @pawankalyan#Pawankalyan pic.twitter.com/tEM8Ar1oij
— TWTPK™ (@TWTPK_) October 14, 2024