Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 8న శుక్రవారం ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో సింహ, కర్కాటకం రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుం సభ్యుల మధ్య గొడవల కారణంగా ఆందోళనతో ఉంటారు. ఖర్చులు పెరగవచ్చు. వాదనలు ఎక్కువగా చేయకుండా ఉండండి.
వృషభం:
ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారులు పెట్టుబడులు పెడితే లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ. ఉద్యోగులు తోటి వారితో మంచిగా ప్రవర్తించండి.
మిథునం:
విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ వేస్తారు. కొత్త వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి అనుకూలం. ఉద్యోగులు ప్రణాళికలు వేస్తారు.
కర్కాటకం:
ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువ. గతం నుంచి పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
సింహం:
సింహ రాశి వారికి ఈరోజు అనుకూల వాతావరణం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. అయితే శత్రువులు మీ పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు.
కన్య:
ఉద్యోగులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సోదరుడి సలహా తీసుకొని కొన్ని పనులు పూర్తి చేస్తారు.
తుల:
ఆర్థిక లావాదేవీలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో వివాదం ఉంటే సామరస్యంగా మాట్లాడాలి. లేదంటే సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది.
వృశ్చికం:
విదేశాలతో వ్యాపారం చేసేవారు శుభవార్తలు వింటారు. ఆర్థిక నష్టాలు ఉండే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు.
ధనస్సు:
ఉద్యోగులు తోటివారితో సక్రమంగా ఉండాలి. లేకుంటే ఉద్యోగంపై ప్రభావం పడే అవకాశం. ఈరోజు ఎవరికి డబ్బు ఇవ్వరాదు. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. సమాజంలో గౌరవం పొందుతారు.
మకర:
ప్రత్యర్థులు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ వేస్తారు. ఓ సమాచారంతో సంతోషంగా గడుపుతారు.
కుంభం:
కొన్ని కార్యక్రమాల వల్ల ఇతరుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు చేసే వారికి అనుకూల వాతావరణం. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం.
మీనం:
గతంలో తీసుకున్న అప్పును ఈరోజు చెల్లించవచ్చు. కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. కొత్త పని మొదలు పెడితే అందులో అదృష్టాన్ని పొందుతారు.