https://oktelugu.com/

Surya And Karthi: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సూర్య, కార్తీ…సినిమాల్లోనే కాదు నిజ జీవితం లోనూ హీరోలే…

ప్రస్తుతం మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యంగా చెన్నై నగరం అయితే వరదల్లో కూరుకుపోయింది. మనిషి నడుము వరకు నీళ్ళు రావడం తో అపార్ట్మెంట్ ల్లో ఉంటున్న జనాలు బిల్డింగ్ పైకి వెళ్లి తల దాచుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 8, 2023 / 08:18 AM IST

    Surya And Karthi

    Follow us on

    Surya And Karthi: ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలాసార్లు చాలా ప్రాంతాలు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా తుఫాన్ ప్రభావం వల్ల చాలా రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాయి. ఇక ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలాసార్లు తుఫాన్ ప్రభావం అనేది విపరీతంగా చూపించింది.

    ఇక ప్రస్తుతం మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యంగా చెన్నై నగరం అయితే వరదల్లో కూరుకుపోయింది. మనిషి నడుము వరకు నీళ్ళు రావడం తో అపార్ట్మెంట్ ల్లో ఉంటున్న జనాలు బిల్డింగ్ పైకి వెళ్లి తల దాచుకున్నారు.ఇక రోడ్ల మీద నీటి వరద పారాడం తో వాహనాలు కూడా నడవకుండా అయిపోయింది. ఇక వందలాది మంది జలదిగ్భందంలో చిక్కుకున్నారు. దాంతో చెన్నై వరద సహాయక చర్యల్లో సినీ నటులు సూర్య, కార్తీ ముందుకొచ్చారు.ఇక వీళ్లిద్దరూ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి ప్రజలకు అండగా ఉండటానికి వాళ్ల వంతు గా వాళ్ళు 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు…

    ఈ బ్రదర్స్ ఎప్పుడైనా కూడా ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందంటే చాలు చాలా తొందరగా రెస్పాండ్ అవుతూ వాళ్ళ వంతు సహాయాన్ని వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళిద్దరూ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందడంతో పాటు వ్యక్తిత్వం పరంగా కూడా చాలామంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇక తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందడంతో పాటు గా తెలుగు ప్రేక్షకులు వీళ్లను ఓన్ చేసుకున్నారు. ఇక దాంతో వీళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తెలుగు హీరో లాగా చలామణి అవుతున్నారు. నిజానికి వీళ్లు చేసే సినిమాలు కూడా చాలా బాగుంటాయి ప్రేక్షకులందరిని మెప్పిస్తాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు వీళ్ళ సినిమాలను చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

    అయితే చాలా మంది హీరోలు వాళ్ల సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో ప్రేక్షకులతో కొన్ని ఎమోషనల్ మాటలు మాట్లాడి వాళ్లని థియేటర్ కు రప్పించే వాళ్ల సినిమాలు చూసే విధంగా చేసుకుంటారు. కానీ ఇలాంటప్పుడు మాత్రం అసలు స్పందించరు కానీ వీళ్లు అలా కాదు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్న, ఏ విపత్తులొచ్చిన, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు ఎదురైన కూడా అందరి కంటే ముందు గా వాళ్లు సహాయం చేయడానికి సిద్ధ పడుతారు. దానివల్లే వాళ్లు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్కువ ఆదరణ పొందుతు ప్రేక్షకుల మనుసు లో చోటు సంపాదించుకున్నారు…