https://oktelugu.com/

Horoscope Today: ధ్రువయోగంతో ఈ రాశుల ఉద్యోగులకు ఈరోజు అన్నీ శుభాలే..

రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి అనుకూల వాతావారణం. వ్యాపారులు కొన్ని మార్పులు చేస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 9, 2025 / 08:10 AM IST

    Horoscope Today(12)

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు ధ్రువ యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు.మరికొన్ని రాశుల వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. అయితే మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి అనుకూల వాతావారణం. వ్యాపారులు కొన్ని మార్పులు చేస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితాలు వస్తాయి.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారులకు ఊహించని దాని కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. ఉద్యోగులు కొత్త పనులు ప్రారంభిస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : మాటలను అదుపులో ఉంచుకోవాలి. సాయంత్రం షికారుకెళ్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంటి అవసరాల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : బలవంతంగా ఎలాంటి పనులు చేయకూడదు. బకాయిలు తిరిగి వస్తాయి. ధన వ్యయం ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : శారీరక శ్రమ పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. సోదరుల మధ్య గోడవలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. రోజూవారీ అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : సోదరులతో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. ప్రియమైన వారితో ప్రయాణాలు చేస్తారు. కొత్త పెట్టుబడులకు ఇదే మంచి అవకాశం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాల నుంచి ముఖ్యమైన సమాచారం పొందుతారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : జీవిత భాగస్వాతో వాగ్వాదం ఉండొచ్చు. తల్లదండ్రుల ఆశీస్సులతో కొత్త పెట్టుబడులు పెడుతారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఉద్యోగులు పదోన్నతుల గురించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. సాయంత్రం సమయంలో ఇంటికి అతిథి రావొచ్చు. దీంతో సందడిగా ఉంటారు.