https://oktelugu.com/

Rajinikanth and Balayya : రజినీకాంత్ బాలయ్య కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటి..? ఆ మూవీ దర్శకుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నప్పటికి బాలయ్య బాబుకు ఉన్న స్టార్ డమైతే వేరే లెవల్ అనే చెప్పాలి. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకి తమిళ్ తో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : January 9, 2025 / 08:17 AM IST

    Rajinikanth , Balayya

    Follow us on

    Rajinikanth and Balayya : నందమూరి నట సింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు సైతం ప్రస్తుతం డాకు మహారాజు సినిమాతో సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి ముందుకు సాగుతున్నాడు. మరిదిలా ఉంటే బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో ఒకప్పటి నుంచి మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగడమే కాకుండా మిగతా హీరోలతో కూడా మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నాడు. అయితే ఇప్పటివరకు ఆయన చాలామంది హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయాలనే ఆసక్తి చూపించినప్పటికి ఏవో కారణాలవల్ల ఆ సినిమాలు క్యాన్సల్ అవుతూ వచ్చాయి. నిజానికి బాలయ్య రజినీకాంత్ కాంబినేషన్ లో కూడా ఒక భారీ మల్టీస్టారర్ సినిమా రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా మిస్ అయిందనే చెప్పాలి. సురేష్ కృష్ణ మంచి కథను రాసుకొని ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉండే విధంగా అతను కథను డెవలప్ చేశారట. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే ప్రకటన వచ్చినప్పటికి చాలామంది తెలుగు అభిమానులు వాళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వద్దు అంటూ గోల చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకు అంటే బాలయ్య రజనీకాంత్ ఇద్దరు కూడా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు వాళ్ళ ఇమేజ్ కి ఏదైనా చిన్న ఇబ్బంది జరిగిన కూడా అభిమానులు ఒప్పుకోరని డిస్ట్రిబ్యూటర్ల నుంచి గాని, నిర్మాతల నుంచి గానీ ఫీడ్ బ్యాక్ అయితే వచ్చిందంట.

    ఇక దాని వల్లే ఆ సినిమా ఆగిపోయింది అంటూ ఒక సందర్భంలో బాలయ్య బాబు తెలియజేయడం విశేషం… మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కనక సినిమా వచ్చి ఉంటే ఆ సినిమా పలు ఇండస్ట్రీ రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ ఉండేదని చాలామంది సినిమా మేధావులు ఇప్పటికీ చెబుతూ ఉండటం విశేషం…

    రజనీకాంత్ సైతం ఇప్పుడు తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు రజినీకాంత్ కూలీ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…

    ఇక బాలయ్య బాబు రజనీకాంత్ కాంబినేషన్ లో ఇప్పుడు ఏమైనా సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మంచి సబ్జెక్టు దొరికితే మాత్రం ఇప్పుడు కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఇద్దరు హీరోలు ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా అనేది…