Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై స్వాతి, విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ఇంద్రయోగం ఏర్పడనుంది. దీంతో మకరం, కుంభం రాశుల వారికి ఊహించని లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
కొందరు శత్రువులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది.వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
వృషభ రాశి:
బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో అనుకున్న పనులు నెరవేరుస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మిథున రాశి:
ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. బంధువుల నుంచి కొంత సమాచారం అందుకుంటారు. ఇంటి అవసరాల కోసం అదనపు ఖర్చులు చేస్తారు. పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి.
కర్కాటక రాశి:
విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో పనిభారం ఎక్కువగా ఉంటుంది. స్నేహితుడి సాయం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సౌకర్యాల కోసం అదనంగా ఖర్చు చేస్తారు.
సింహారాశి:
వ్యాపారులకు లాభాలు ఉంటాయి.పాత మిత్రులను కలుసుకోవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. భవిష్యత్ కోసం కొత్త ప్రణాళిక రూపొందిస్తారు.
కన్య రాశి:
కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. అవసరానికి మించి ఖర్చులు ఉంటాయి.
తుల రాశి:
ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా… అనుకూల ఫలితమే ఉంటుంది. కొన్ని విషయాల్లో విజయం వరిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి:
ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. కొత్త స్నేహితులను కలుస్తారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
ధనస్సు రాశి:
శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగాల్లో ఉండేవారికి అనుకూలమై వాతావరణం. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్తారు. మనసులో వచ్చే కొన్ని ఆలోచనలతో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి:
వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి. అయితే సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో కొత్త మార్పులు వస్తాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులపై ఇతరుల సలహా తీసుకోవాలి.
కుంభరాశి:
విద్యారంగంలో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి:
కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు ఉంటాయి. జీవిత భాగస్వామి కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇతరుల నుంచి అధిక ప్రయోజనాలు పొందుతారు.