https://oktelugu.com/

Thangalaan OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న విక్రమ్ ‘తంగలాన్’ చిత్రం..స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే!

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తోనే మొదలైంది కానీ, ఎందుకో అనుకున్న స్థాయి బాక్స్ ఆఫీస్ నంబర్స్ రాలేదు. కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని తీసిన సినిమా అవ్వడం వల్లే అనుకున్న రేంజ్ కి వెళ్లలేదని విశ్లేషకుల అభిప్రాయం.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 06:12 AM IST

    Thangalaan(1)

    Follow us on

    Thangalaan: ప్రయోగాలతో ఎల్లప్పుడూ ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసే సినిమాలు చేసే విక్రమ్ , లేటెస్ట్ గా ‘తంగలాన్’ చిత్రంతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తోనే మొదలైంది కానీ, ఎందుకో అనుకున్న స్థాయి బాక్స్ ఆఫీస్ నంబర్స్ రాలేదు. కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని తీసిన సినిమా అవ్వడం వల్లే అనుకున్న రేంజ్ కి వెళ్లలేదని విశ్లేషకుల అభిప్రాయం. అంతే కాదు, ఈ చిత్రాన్ని చూసేందుకు చాలా ఓపిక కావాలి, ఒక కొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టుగా అనిపించే ఈ సినిమాలో విక్రమ్ పెట్టిన శ్రమకి తగ్గ ఫలితం రాలేదని ఆయన అభిమానులు చాలా తీవ్రమైన బాధపడ్డారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

    ఇది ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్ రివ్యూస్ కి చాలా తక్కువ అనే చెప్పాలి, విక్రమ్ గెటప్ కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అలాంటి గెటప్ తో ఏ హీరో సినిమా చేసినా ఇంతే ఫలితం వస్తుందని, విక్రమ్ కాబట్టి ఆ మాత్రం వసూళ్లు అయినా వచ్చాయని, అదే వేరే హీరో చేసుకుంటే మొదటి రోజే ఈ చిత్రం షెడ్డుకి వీల్లేదని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్స్ లో పర్వాలేదు అనే రేంజ్ పెర్ఫార్మన్స్ ని అందుకున్న ఈ చిత్రం, అతి త్వరలోనే ఓటీటీ లోకి విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని భారీ ఫ్యాన్సీ రేట్ కి తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. అందుతున్న విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్ నెల మొదటి వారం లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఓటీటీ లో ఇలాంటి సినిమాలకు మొదటి నుండే మంచి ఆదరణ లభిస్తుంది.

    ఎన్నోసార్లు అది రుజువు అయ్యింది కూడా, మరి ఈ సినిమాకి కూడా అలాంటి ఆదరణ దక్కుతుందా, లేదా థియేటర్స్ లో లాగానే అంతంత మాత్రం రెస్పాన్స్ ని దక్కించుకుంటుందా అనేది చూడాలి. విక్రమ్ మరియు మాళవిక మోహనన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు చూసేందుకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమాకి సీక్వెల్ తీసే ప్లాన్ లో కూడా ఉన్నాడు డైరెక్టర్ పీఏ రంజిత్. అయితే ఓటీటీ వెర్షన్ లో కొత్త సన్నివేశాలను జత చేసి విడుదల చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా విక్రమ్ తదుపరి చేయబోయే సినిమా గురించి ఇప్పటి వరకు సరైన అప్డేట్, అభిమానులు ఆయన కొత్త సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.