Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు మాళవ్య యోగం, సాధ్య యోగం ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి శుభఫలితాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారికి ఈరోజు అనుకోని లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. కటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు.
వృషభ రాశి:
విద్యార్థులు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు సీనియర్లతో సత్సంబంధాలు మెయింటేన్ చేస్తారు. ఓ అధికారి వల్ల వీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు.
మిథున రాశి:
వ్యాపారులకు కటుుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. రోజూ వారీ అవసరాలకు ఖర్చులు ఉంటాయి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు బిజీగా ఉంటారు.
కర్కాటక రాశి:
విదేశాల్లోఉంటున్న వారి నుంచి శుభవార్తలు వింటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కొన్ని శుభవార్తలు వింటారు.
సింహారాశి:
కొన్ని నిర్ణయాలు వ్యతిరేకతను ఇస్తాయి. విభేదాలకు దూరంగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా జరపాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
కన్య రాశి:
పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనసులో నిరాశ ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు అందుతుంది. సమాజంలో గౌరవం పోతుంది.
తుల రాశి:
ఉద్యోగులకు కార్యాలయంలో ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి:
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. ఉద్యోగులు కొన్ని రంగాల్లో రాణిస్తారు. బంధువులను కలుస్తారు.
ధనస్సు రాశి:
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కేర్ గా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సాయంతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. సామాజిక రంగాలపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో పాల్గొంటారు.
కుంభరాశి:
విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. విద్యార్థులు ఉన్నత విద్య విషయంలో శుభవార్త వింటారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలి. లేకుంటే సమస్యలు వస్తాయి.
మీనరాశి:
ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలు పొందుతారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామి సహాయంతో పెట్టుబడులు పెడుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.