Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో మిగిలిన ఎపిసోడ్స్ ఎలా ఉన్నా వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోతున్నాయి. ప్రతీ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఎదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పుని ప్రశ్నించేందుకు హోస్ట్ ప్రయత్నం చేస్తే బాగుండును అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ సీజన్ లో నాగార్జున అదే చేస్తున్నాడు. ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టుగా ఆయన అడగాల్సిన ప్రశ్నలు అడిగి, చూపించాల్సిన వీడియోలు చూపించి షో ని ఆసక్తికరంగా మారుస్తున్నాడు. ఈ సీజన్ కూడా సూపర్ హిట్ వైపు దూసుకొని వెళ్తుందంటే అందుకు కారణం నాగార్జున హోస్టింగ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే నేడు నాగార్జున హౌస్ లో హీరో ఎవరు, జీరో ఎవరు అనే గేమ్ ఆడాడు. ఈ గేమ్ లో హౌస్ లో అత్యధిక శాతం మంది నబీల్ కి హీరో ట్యాగ్ ఇచ్చి కిరీటం పెట్టారు.
ఎందుకంటే హౌస్ లో ఏ టాస్కు ఇచ్చిన తన నుండి నూటికి నూరు శాతం ఇవ్వడంతో పాటు, కంటెస్టెంట్స్ తో సరదాగా ఉండడం, గొంతు లేపి మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడడం, మానవత్వం చూపడం ఇలా ఒక టాప్ కంటెస్టెంట్ కి ఉండాల్సిన లక్షణాలు అన్ని ఇతనిలో ఉన్నాయి అంటూ హౌస్ మేట్స్ ఆయనకు హీరో ట్యాగ్ ఇచ్చాడు. ఇక నబీల్ తర్వాతి స్థానం లో పృథ్వీ నిలిచాడు. బెలూన్స్ టాస్క్ లో దాదాపుగా 3 గంటల పాటు చిరు నవ్వుతో నాన్ స్టాప్ గా నిలబడడం, ఆ తర్వాత తనలో పెద్ద నెగటివ్ గా నిల్చిన కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవడం, బూతులు మాట్లాడడం ఆపేయడం వంటివి కంటెస్టెంట్స్ కి బాగా నచ్చాయి, అందుకే అతనికి నబీల్ తర్వాత రెండవ స్థానం దక్కింది. ఇక మూడవ స్థానం లో సీత నిల్చింది. ఎమోషన్స్ ఆమెలోని అతి పెద్ద బలహీనత, దాని వాళ్ళ టాస్కులు సరిగా ఆడదేమో అని గతం లో కంటెస్టెంట్స్ అనేవారు.
కానీ ఇప్పుడు ఆమె అదే ఎమోషన్స్ ని బ్యాలన్స్ చేసుకుంటూ టాస్కులు కుమ్మేస్తుంది, అలాగే చీఫ్ గా కూడా తన బాధ్యతను సమర్థవతంగా నిర్వహిస్తుంది. దీంతో హౌస్ లో ఆమెకి కంటెస్టెంట్స్ హీరో క్యాటగిరీలో మూడవ స్థానం లో నిలిపారు. ఇక నాగ మణికంఠ కి అత్యధిక కంటెస్టెంట్స్ జీరో స్థానం ఇచ్చారు. సరైన నిర్ణయాలు తీసుకోవడం లో తడబాటు తనం, అబద్దాలు చెప్పడం, ప్రతీ దానికి ఓవర్ గా ఆలోచిస్తూ చేయాలనుకున్న పనిని చేయకపోవడం, అక్కడ ఒక మాట, ఇక్కడొక మాట మాట్లాడుతూ గొడవలు సృష్టించడం వంటి వాటి వల్ల మణికంఠ ని అందరూ జీరో ని చేసారు. జీరో గా ఆయనకు అత్యధిక ఓట్లు పడడంతో మణికంఠ ని జైలుకు పంపారని టాక్, ఇది రేపటి ఎపిసోడ్ లో టెలికాస్ట్ కాబోతుంది. అయితే చూసే ఆడియన్స్ కి పాపం మణికంఠ ని బాగా టార్గెట్ చేసినట్టుగా అనిపించింది.