Hyderabad: హైదరాబాద్‌లో ఇప్పుడు ఈ ప్రాంతానికి డిమాండ్.. త్వరపడండి

నగరంలో ఐటీ కారిడార్లు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో పారిశ్రామికంగా పటాన్‌‌చెరు, కాప్రా గుర్తింపు పొందాయి. ఈ రెండింటికి కూడా పారిశ్రామిక ప్రాంతాలుగా పేరున్నాయి. ముందు ముందు పటాన్‌చెరు వైపు ఐటీ కారిడార్ వస్తోంది. దాంతో అక్కడ మరింత అభివృద్ధి జరుగుతుంది. అందుకే ఆ ప్రాంతానికి డిమాండ్ పెరుగుతోంది. కాప్రాలో కూడా అభివృద్ధి మెల్లమెల్లగా ఊపందుకుంటోంది. ఒకప్పుడు చిన్న వాడగానే ఉన్న కాప్రా.. ఇప్పుడు చాలా వరకు అభివృద్ధి సాధించింది.

Written By: Srinivas, Updated On : September 28, 2024 6:32 pm

Hyderabad(6)

Follow us on

Hyderabad: రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ ప్లేసులో ఉంది. అందుకే.. ఇక్కడికి ఏటా వలసలు పెరుగుతున్నాయి. దాంతో సిటీ పరిధి కూడా పెరుగుతూ వస్తోంది. కట్ చేస్తే.. ఎవరికైనా మహానగరంలో ఓ ఇల్లు కొనుగోలు చేయాలని ఆశ ఉంటుంది. తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఓ ఇంటిని సొంతం చేసుకోవాలని కలలు కంటుంటారు. అయితే.. హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనడమంటే కూడా సాధారణ విషయం కాదు. బడ్జెట్ చాలా హైరేంజ్‌లో ఉంటుందనేది తెలిసిందే. కొంత మంది ధైర్యం చేసి కొందామనుకున్నా.. ఎక్కడ కొనాలి..? ఎటు వైపుగా కొనుగోలు చేస్తే బెటర్..? అనే సందేహాలు వస్తుంటాయి. నగర పరిధిలో ఎక్కడ కొనుగోలు చేస్తే ఫ్యూచర్ ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం..

నగరంలో ఐటీ కారిడార్లు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో పారిశ్రామికంగా పటాన్‌‌చెరు, కాప్రా గుర్తింపు పొందాయి. ఈ రెండింటికి కూడా పారిశ్రామిక ప్రాంతాలుగా పేరున్నాయి. ముందు ముందు పటాన్‌చెరు వైపు ఐటీ కారిడార్ వస్తోంది. దాంతో అక్కడ మరింత అభివృద్ధి జరుగుతుంది. అందుకే ఆ ప్రాంతానికి డిమాండ్ పెరుగుతోంది. కాప్రాలో కూడా అభివృద్ధి మెల్లమెల్లగా ఊపందుకుంటోంది. ఒకప్పుడు చిన్న వాడగానే ఉన్న కాప్రా.. ఇప్పుడు చాలా వరకు అభివృద్ధి సాధించింది. కాప్రా చుట్టూరా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అణుఇంధన సంస్థ ఎన్ఎఫ్‌సీ, హిందుస్తాన్ కేబుల్ కంపెనీ లిమిటెడ్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వంటి కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఉన్నాయి.

కాప్రా పరిధినలోనే చర్లపల్లి, మల్లాపూర్, కుషాయిగూడ, నాచారం వంటి పారిశ్రామిక వాడలూ ఉన్నాయి. ఇక్కడ ఉపాధి పొందే వారి సంఖ్య ఎన్నో రెట్లు ఉంటుంది. దాంతో లెక్కలేనన్ని కాలనీలు వెలిశాయి. ఇది మొన్నటి వరకు అక్కడ ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. నివాసం ఉండేందుకు అనువైన ప్రాంతంగా మారింది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, కాలేజీలు, రవాణా వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి.

ఇక.. చర్లపల్లి, మౌలాలీ రైల్వే స్టషన్ల పరిధినలో ప్రధాన రైళ్లు అన్నీ ఆగుతాయి. ఉత్తరభారతీయులు సైతం ఎక్కువగా కాప్రా వైపే స్థిరపడి ఉన్నారు. దానికి కారణం కూడా ఈ రైల్వే వ్యవస్థనే. ఒకప్పుడు బస్తీలుగా ఉండిపోయిన ఈ ప్రాంతాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తున్నాయి. లగ్జరీ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఆధునిక డిజైన్లు, యువత అభిరుచికి తగ్గట్లుగా నిర్మిస్తూ బిల్డర్లు ఆకట్టుకుంటున్నారు.

అయితే.. ఇన్ని హంగులతో ఆధునికతను అందిపుచ్చుకుంటున్న ఈ కాలనీల్లో ధరలూ భారీగానే ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ.. ఇక్కడి రియల్ ఎస్టేట్ పూర్తిగా మధ్యతరగతికి అందుబాటులో ఉండే ధరలే పలుకుతున్నాయి. ఐటీ కారిడార్‌లలో కానీ.. వేరే ఇతర ప్రాంతాల్లో ఉన్న ధరలు ఇక్కడ కనిపించడం లేదు. పీస్ ఫుల్ వాతావరణం ఉండడం.. ఇక్కడి నుంచి అంతటికి రవాణా సదుపాయం ఉండడంతో ఈ ఏరియాలో ఇప్పుడు డిమాండ్ భారీగా పెరుగుతోంది. అందుకే.. ఈ తరుణంలో ఎవరైనా ఆస్తులు, ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ఏరియాను ఎంచుకుంటే భవిష్యత్ బాగుంటుందని రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు సూచిస్తున్నారు.