Horoscope Today: 2024 మే 30 గురువారం రోజున ద్వాదశ రాశులపై ధనిష్ఠ, శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో 5 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారికి ఈరోజు ఖర్చలు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామి కోసం కొన్ని పనులు చేస్తారు.
వృషభ రాశి:
గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త అప్పులు చేస్తారు. ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
మిథున రాశి:
వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉండే అవకాశం. ఉద్యోగులు కార్యాలయంలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. చట్టపరమైన అంశాలపై అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి:
ఉద్యోగులు కొన్ని విషయాల్లో తొందరపడొద్దు. సీనియర్ల మద్దతు పొందాలి. ఖర్చులు అదనంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఓ విషయంపై ఆందోళన చెందుతారు.
సింహారాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి వాగ్దానాలు చేయొద్దు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహిరంచాలి. వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి.
కన్య రాశి:
రాజకీయ నాయకులకు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే సీనియర్ల మద్దతు ఉంటే ఉపశమనం పొందుతారు.
తుల రాశి:
సన్నిహితులతో విభేదాలు వస్తాయి. దినచర్యలో మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. కొందరి వ్యక్తుల నుంచి ప్రయోజనాలు పొందుతారు.
వృశ్చిక రాశి:
విద్యార్థులు కెరీర్ పై ఆందోళన చెందుతారు. వ్యాపారులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయాలి.
ధనస్సు రాశి:
వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు ఓ శుభవార్త వింటారు.
మకర రాశి:
ఈ రాశి వారు ఈరోజు శక్తివంతంగా ఉంటారు. ఉద్యోగులు ఆహ్లదకరమైన వాతావరణంలో ఉంటారు. జీవిత భాగస్వామితో ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి:
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలకు కెరీర్ కు సంబంధించిన విషయాలను నేర్పుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మీనరాశి:
ఉద్యోగులకు కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఎవరికైనా సాయం చేసే అవకాశం వస్తే ముందుకు వస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.