Horoscope Today: 2024 జూలై 5 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై అర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. నేడు అమావాస్య కారణంగా కొన్ని రాశుల వారు జగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్ పెట్టుబడులపై ఇతరుల సలహాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.
వృషభ రాశి:
స్థిరాస్తికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఆశించిన విజయం అందుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో ఉన్న వివాదాలు నేటితో ముగుస్తాయి.
మిథున రాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితులను కలుస్తారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
కర్కాటక రాశి:
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. తొందరపాటులో కొన్ని పొరపాట్లు చేయొచ్చు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
సింహారాశి:
ఆర్థిక లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో భేదాభిప్రాయాలు ఉంటాయి.మొత్తంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది.
కన్య రాశి:
పెండింగు పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభాలు ఉండే అవకాశం. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. పిల్లలతో సంతోషంగా ఉంటారు.
తుల రాశి:
కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరుతారు. డబ్బ గురించి ఆలోచించేటప్పుడు చాకచక్య నిర్ణయాన్ని తీసుకోవాలి.
వృశ్చిక రాశి:
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని విషయాల్లో ఆందోళన ఏర్పడుతుంది. తల్లి కోసం బహమతిని కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి:
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. సీనియర్ల మద్దతు ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు.
మకర రాశి:
వ్యాపార అభివృద్ధిపై దృష్టి పెడుతారు. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ వ్యాపారానికి సభ్యుల మద్దతు ఉంటుంది.
కుంభరాశి:
నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. డబ్బు కొరత ఉన్నందువల్ల కొంత ఆందోళనగా ఉంటారు. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి:
నిర్మాణ పనుల కోసం డబ్బును వెచ్చిస్తారు. భవిష్యత్ కోసం వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఇతరులతో వాదనలు ఎక్కువగా చేయొద్దు.