Pawan Kalyan: చిరంజీవికి నచ్చక పోయిన కూడా పవన్ కళ్యాణ్ ఆ సినిమాను ఎందుకు చేయమని చెప్పాడో తెలుసా..?

దాదాపు 40 సంవత్సరాల పాటు మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్నాడు. మరి ఇలాంటి చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర ' అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తన కెరియర్ లో తీసిన స్టాలిన్ అనే సినిమా ఆయనకి పెద్దగా ఇష్టం లేకపోయిన కూడా చేశారట.

Written By: Gopi, Updated On : July 5, 2024 8:21 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం మనకు అనుకూలంగా ఉండవు. ఇక నటుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో చేతిలో రూపాయి ఉండదు, కడుపు కాలుతూ ఉంటుంది. ఎవరినైనా అడుగుదాం అంటే ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. వాటన్నింటినీ భరించి, కష్టాలను ఎదురించి, కన్నీళ్లను దిగమింగి ఎప్పటికైనా మనకు ఒక రోజు వస్తుంది అనే ఉద్దేశ్యంతో తెగించి ఇక్కడే ఉన్నవాళ్లు చాలా మంచి సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు.

ఇక దానికి ఉదాహరణగా మనం చిరంజీవిని తీసుకోవచ్చు. ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడ మెగాస్టార్ గా ఎదిగి ఇప్పుడు ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. ఇక దాదాపు 40 సంవత్సరాల పాటు మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్నాడు. మరి ఇలాంటి చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తన కెరియర్ లో తీసిన స్టాలిన్ అనే సినిమా ఆయనకి పెద్దగా ఇష్టం లేకపోయిన కూడా చేశారట. దానికి కారణం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది. నిజానికి మురుగుదాస్ డైరెక్షన్ లో చిరంజీవి అప్పటికే చాలాసార్లు ఒక సినిమా చేయాలని అనుకుంటూన్నాడు.

కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇక మొత్తానికైతే స్టాలిన్ సినిమా స్టోరీని పరుచూరి బ్రదర్స్ కి చెప్పడంతో ఆ కథ చిరంజీవికి పెద్దగా నచ్చలేదట. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ కథను విని చిరంజీవికి అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని చేయమని చిరంజీవిని రిక్వెస్ట్ చేశారట. ఇక దాంతో చిరంజీవి స్టాలిన్ సినిమా చేయాల్సి వచ్చిందట. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం చిరంజీవిని ఆ సినిమా ఎందుకు చేయమని చెప్పాడు అంటే అప్పటికి వాళ్ళు పొలిటికల్ పార్టీ పెడదామనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమా అయితే చిరంజీవికి బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే తను అలా చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనే విషయం పక్కన పెడితే అందులో సోషల్ మెసేజ్ ఉంది కాబట్టి అది చిరంజీవి ద్వారా జనాల్లోకి వెళితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ అలా చెప్పి ఉంటాడని మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…