War 2: వార్ 2 లో ఎన్టీయార్ చనిపోతాడా..? ఏంటి భయ్యా ఈ ట్విస్ట్..?

హృతిక్ రోషన్ మంచి మార్కెట్ ఉన్న హీరో ఎన్టీయార్ కూడా పాన్ ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ ను అందుకుంటున్న హీరో కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 13, 2024 8:49 am

War 2

Follow us on

War 2: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ లో వస్తున్న వార్ 2 సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ని పూర్తి చేసిన ఎన్టీఆర్..ఈ సినిమా కోసం హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే… అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఎన్టీయార్, హృతిక్ రోషన్ ఇద్దరి క్యారెక్టర్లలో ఎవరు హైలెట్ కానున్నారు అనే వార్తలకైతే ఇప్పుడు సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే హృతిక్ రోషన్ మంచి మార్కెట్ ఉన్న హీరో ఎన్టీయార్ కూడా పాన్ ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ ను అందుకుంటున్న హీరో కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఇద్దరి క్యారెక్టర్లు కూడా సమ ఉజ్జిలుగా సాగుతాయా లేదా అనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇక దానికి తోడుగా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఎన్టీయార్ నటిస్తున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక 30 నిమిషాల పాటు సినిమాలో ఉండి ఆ తర్వాత చనిపోబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ చనిపోయే క్యారెక్టర్ ను ఎందుకు ఒప్పుకుంటాడు అంటూ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. కానీ ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమాకు కీలకం కావడంతో తను ఆ పాత్రను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పాత్ర 30 నిమిషాల పాటు ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆయన చనిపోతారు. ఇక ఆయన ఆశ నెరవేర్చడానికి హృతిక్ రోషన్ సినిమా మొత్తం కష్టపడతాడు అనేది సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం… చూడాలి మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అనేది…