Horoscope : రాశిఫలాలను చాలా మంది నమ్ముతుంటారు. జరిగేవి జరుగుతూనే ఉంటాయి. అయినా సరే మన జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకీ ఈ రోజు మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసా? అయితే ఈ రోజు రాశిఫలాలు చదివేసేయండి.
మేషం..(అశ్విని, భరణి, కృత్తిక 1)
బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
వృషభం..(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
మిథునం..(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కర్కాటకం.. (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కుటుంబ కలహాలు దూరమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
సింహం..(మఖ, పుబ్బ, ఉత్తర 1)
నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.
కన్య..(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబపరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
తుల..(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ప్రయత్నం మేరకు స్వల్పలాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారరంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతనకార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
వృశ్చికం..(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
ధనుస్సు..(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిరనివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
మకరం..(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
విందులు, వినోదాలకు దూరంగా ఉండట మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కుంభం..(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. సహనంవహించడం అన్నివిధాలా మేలు.
మీనం..(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబంలో చిన్నిచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..