Border Gavaskar Trophy : కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. బలంగా నిలబడాల్సిన మ్యాచ్లో చేతులెత్తేసింది. బలమైన బ్యాటింగ్.. భీకరమైన బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికీ నిరాశపరిచింది. సిడ్ని టెస్టులో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 185 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ దారుణమైన ఆట తీరుతో నిరాశపరిచింది.. కేవలం 157 పరుగులకే ఆల్ అవుట్ అయింది. మొత్తంగా 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఈ టార్గెట్ ను ఆస్ట్రేలియా సులువుగా చేదించింది. నాలుగు వికెట్లు కోల్పోయి గెలిచింది. ఆరు వికెట్ల తేడాతో టీమిండియా పై విజయాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో ఖవాజా 41, హెడ్ 34, వెబ్ స్టర్ 39 పరుగులు చేశారు. కీలకమైన మ్యాచ్ లో బుమ్రా తీవ్రమైన వెన్ను నొప్పి వల్ల బౌలింగ్ చేయలేకపోవడం.. అది టీమిండియా విజయంపై తీవ్ర ప్రభావం చూపించింది.
తేలిపోయిన బౌలర్లు
టీమిండియా 162 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచగా.. ఆ పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీం ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్ బలహీనమైంది. ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపించిన మైదానంపై.. టీమ్ ఇండియా బౌలర్లు ఆ పస చూపించలేకపోయారు. ఆస్ట్రేలియా బ్యాటర్ల ముందు తేలిపోయారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఘనవిజయాన్ని సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపునుసంతం చేసుకుంది. ఈ ఓటమి ద్వారా టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆశలను వదిలేసుకుంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా దాదాపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లినట్టే. ఆస్ట్రేలియా శ్రీలంకతో రెండు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ టెస్టులలో ఆస్ట్రేలియా ఓడిపోతే.. శ్రీలంకకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశాలుంటాయి.
ఇదేం నిర్లక్ష్యం
తొలి ఇన్నింగ్స్ లో తేలిపోయిన బ్యాటర్లు.. రెండవ ఇన్నింగ్స్ లోనూ అదే దారి అనుసరించారు. గట్టిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఏదో అర్జెంటు పని ఉన్నట్టుగా.. అసలు ఆడ్టటమే ఇష్టం లేదు అన్నట్టుగా బ్యాటింగ్ చేశారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి వాళ్ళు అలా వరుసగా విఫలం కావడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ” ఆస్ట్రేలియా ఆటగాళ్లు 180 రన్స్ కు కుప్పకూలిన తర్వాత ఆ ఆపర్చునిటీ ని టీమిండియా ప్లేయర్లు యుటిలైజ్ చేసుకోవాలి. మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. స్థిరమైన ఇన్నింగ్స్ ఆడాలి. బంతులను సరిగ్గా కాచుకోవాలి. కానీ అవేవీ టీమిండియా ఆటగాళ్లు చేయలేదు. దీంతో దారుణమైన ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చిందని” అభిమానులు వాపోతున్నారు.