Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 22న ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు శుభవార్తలు వింటారు. మరికొన్ని రాశుల వారు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారు ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది.
వృషభ రాశి:
విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునేవారికి అనుకూల సమయం. కొన్ని పనుల్లో ఆలస్యం కావొచ్చు. దీంతో నిరాశతో ఉంటారు. బ్యాంకింగ్ రంగంలోని వారికి తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి.
మిథునం:
కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొటారు. స్నేహితుల నుంచి సాయం కొరిన వెంటనే అందుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు.
కర్కాటకం:
రాజకీయంలోని వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నాయకత్వం శక్తి సామర్థ్యం పెరుగుతుంది. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులో ఒకరిని కలుసుకుంటారు.
సింహ:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొన్ని రంగాల వారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరగుతుంది.
కన్య:
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూల ఫలితాలు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొవచ్చు.
తుల:
వ్యాపార భాగస్వామితో కొత్త పనులు ప్రారంభిస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. చాలాకాలం పెండింగులో ఉన్న పనులు వెటనే పూర్తి చేస్తారు.
వృశ్చికం:
ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువ. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక రంగాల్లో పనిచేసేవారు ప్రశంసలు పొందుతారు.
ధనస్సు:
విద్యారంగలోని వారు కొన్ని శుభవార్తలు వింటారు. ఆస్తిలో పెట్టుబడులు పెట్టే ముందు వాటి నియమాలు జాగ్రత్తగా చదవాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.
మకర:
ఉద్యోగులు కార్యాలయాల్లో తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. మనసు కాస్త కల్లోలంగా ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. పెద్దల పట్ల విధేయత ఉండాలి.
కుంభం:
కొన్ని శుభవార్తలు వింటారు. సోదరులతో సంతషంగా ఉంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి కష్టపడుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మీనం:
ఈ రాశివారు ఈరోజు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు తోటివారితో కలిసి పనిచేస్తారు. కొన్ని చర్చల ద్వారా పాత సమస్యలు పరిష్కారం అవుతాయి.