Homeఆధ్యాత్మికంToday 19 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని విధాల అనుకూలం..

Today 19 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని విధాల అనుకూలం..

Today 19 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరికొన్ని రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలు పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు. ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కొత్తగా పెట్టుబడును పెడతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా ఉంటారు. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల నుంచి ధన సహాయం పొందుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొందరు పనులకు అడ్డంకులు సృష్టిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా వరకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతో మానసికంగా ఇబ్బందులు పడతారు. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సోదరుల మధ్య విభేదాలు ఏర్పడి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏర్పడతాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు కలవడంతో వారితో అదనపు పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే కొన్ని పనులు పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. పదోన్నతి విషయంలో శుభవార్త వింటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా సంతృప్తిగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కార్యాలయాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నించేవారు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పక్కన ఉండే వ్యక్తుల ప్రవర్తన పై దృష్టి పెట్టాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల విషయంలో శుభవార్తలు వింటారు. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈ రోజు ఎవరికీ డబ్బు ఇవ్వకపోవడమే మంచిది. కొన్ని విషయాల్లో భయాందోళన చెందుతారు. అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో సమస్య పరిష్కారం అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. ఇంట్లో అవసరమైన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఉద్యోగ సమాచారం అందుకుంటారు. విద్యార్థులు నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా గురువుల మద్దతును పొందుతారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఉద్యోగుల నుంచి కీలకమైన సమాచారం పొందుతారు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి. కుటుంబ సభ్యుల మద్దతుతో చేసే వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. కొత్త ఒప్పందాలు చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. స్నేహితుల సహాయంతో దూర ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. మానసికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version