Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే రోజు షష్ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు. వ్యాపారులకు అధిక లాభాలు వచ్చే అవకాశం. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి:
ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. కటుంబ సభ్యుల ఆశీస్సులతో వ్యాపారులు లాభాన్ని పొందవచ్చు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకుంటే భవిష్యత్ లో తీవ్ర నష్టాలు ఉండే అవకాశం.
మిథున రాశి:
కష్టపడి పనిచేసిన వారికి తగిన ఫలితాలు ఉంటాయి. ఈరోజు సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి కోసం ఖర్చులు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కర్కాటక రాశి:
జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. కొన్ని పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారం కోసంఅనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారు. అనుకోని అదృష్టం కలుగుతుంది.
సింహా రాశి:
గతంలో చేపట్టిన పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. బంధువులతో వాగ్వాదం ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు ఉత్సాహంగా ఉంటుంది. ఓ సమాచారం వీరికి సంతోషాన్ని అందిస్తుంది.
కన్యరాశి:
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలపై ప్రయాణాలు చేయాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల నుంచి శుభఫలితాలు వింటారు.
తుల రాశి:
కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇదే మంచి సమయం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. బంధువుల నుంచి ధన సాయం పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆాదాయం పొందుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి:
ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే ఆలోచించాలి. బంధువుల్లో ఒకిరికి అనారోగ్యం ఉంటుంది. దీంతో ఆందోళన చెందుతారు.
ధనస్సు రాశి:
జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండొచ్చు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తా3రు. వ్యాపారులకు నష్టాలు ఎదురవుతాయి. దీంతో ఆందోళనగా ఉంటారు. కొన్ని పొరపాట్ల వలన ఉద్యోగులు ఆందోళన చెందుతారు.
మకర రాశి:
శత్రువులపై ఓ కన్నేసి ఉంచాలి. లేకుంటే పనుల్లో ఆటంకం సృష్టిస్తారు. రోజూవారీ అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.
కుంభ రాశి:
సాయంత్రి స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. బిజీ లైఫ్ కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు. ఇది నిరాశను కలిగిస్తుంది.
మీనరాశి:
వ్యాపారులు ఎక్కువగా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. స్నేహితులతో సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.