https://oktelugu.com/

England Vs New Zealand: వెల్లింగ్టన్ టెస్టులో న్యూజిలాండ్ జట్టుకు గొడుగు పట్టిన ఇంగ్లాండ్.. టెస్ట్ క్రికెట్ లో ఇదో సంచలనం..

ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో ఇంగ్లాండ్ జట్టు పర్యటిస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచింది. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తలపడుతోంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 280 పరుగులు చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 7, 2024 / 08:04 AM IST

    England Vs New Zealand

    Follow us on

    England Vs New Zealand: టి20 కి అలవాటు పడిన ఈ తరం ప్రేక్షకులకు.. వన్డేలు మాత్రమే చూస్తున్న కొంతమంది అభిమానులకు టెస్ట్ క్రికెట్లో బ్యూటీ తెలియదు. అది తెలియాలంటే టెస్ట్ క్రికెట్ ను చూస్తూ ఉండాలి. గంటల తరబడి ఆట సాగుతున్నప్పటికీ.. ప్రతిక్షణం బోర్ కలుగుతున్నప్పటికీ.. అప్పుడప్పుడు మైదానంలో అద్భుతం మాదిరిగా ఆవిష్కారమయ్యే దృశ్యాలు టెస్ట్ క్రికెట్ లో దాగివున్న అసలైన అందాన్ని అభిమానులకు అందిస్తాయి.

    ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో ఇంగ్లాండ్ జట్టు పర్యటిస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచింది. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తలపడుతోంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 280 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టును 150 పరుగుల లోపే ఆల్ అవుట్ చేయాలని ఇంగ్లాండ్ జట్టు భావించింది. ఇందులో భాగంగానే ఫీల్డింగ్ సెటప్ పూర్తిగా మార్చేసింది. అందువల్లే రచిన్ రవీంద్ర త్వరగా అవుట్ అయ్యాడు. ఇతడు మాత్రమే కాదు. లాతం, కాన్వే, విలియం సన్, మిచల్ వంటి వారు కూడా ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ జట్టును త్వరగా ఆల్ అవుట్ చేయడానికి మైదానంలో గొడుగు మాదిరిగా ఫీల్డింగ్ ను సెటప్ చేశాడు.. స్లిప్ కార్డెన్, గల్లి, బ్యాక్ బడ్ పాయింట్, బ్యాట్ ముందు, లెగ్ స్లిప్, లెగ్ గల్లి, డీప్ షార్ట్ లెగ్ వంటి ప్రాంతాలలో ఫీల్డింగ్ సెట్ చేయడంతో.. డ్రోన్ షాట్ లో చూస్తే ఆ ఫీల్డింగ్ సెటప్ గొడుగు మాదిరిగా కనిపించింది. ముఖ్యంగా కార్సే షార్ట్ పిచ్ బంతులు వేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు.

    గతంలో కూడా

    ఇంగ్లాండ్ ఇప్పుడు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియాతో జరిగిన 2023 యాషేస్ సిరీస్ లో కూడా ఇలాంటి ప్రయోగమే చేసింది. నాడు ఎడ్జ్ బస్టాన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఉస్మాన్ ఖవాజా అప్పటికే సెంచరీ చేశాడు. అతడు అంతకంతకు ప్రమాదకరంగా మారుతుండడంతో.. అతడిని అవుట్ చేయడానికి స్టోక్స్ సరికొత్త ప్రణాళిక రూపొందించాడు. గొడుగు ఆకారంలో ఫీల్డింగ్ సెట్ చేయడంతో.. ఖవాజా అవుట్ కాక తప్పలేదు. నాడు ఖవాజా తనకు ఎదురైన బంతిని హాఫ్ సైడ్ లో కొట్టడానికి ప్రయత్నించాడు. కాకపోతే అబంతి అతడి స్టంప్స్ ను పడగొట్టింది..ఇప్పుడు వెల్లింగ్టన్ టెస్టులోనూ స్టోక్స్ అదేవిధంగా అనుసరించాడు. సెమీ సర్కిల్లో బ్యాటర్ ముందు ఆరుగురు ఫీల్డర్లను సెట్ చేశాడంటే స్టోక్స్ బుర్ర మామూలుది కాదు. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోయి.. తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ జట్టు.. శనివారం ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొన్న దానినిబట్టి రెండవ టెస్ట్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఒకవేళ న్యూజిలాండ్ జట్టు రెండవ మ్యాచ్లో ఓడిపోతే, ఇంగ్లాండ్ విజేత గా నిలుస్తుంది. అంతేకాదు దాదాపు 16 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ పై వారి స్వదేశంలో టెస్ట్ సిరీస్ గెలిచిన ఘనతను సొంతం చేసుకుంటుంది.