https://oktelugu.com/

Horoscope Today: ఈ రెండు రాశుల వారికి ఆకస్మికంగా ధనయోగం..

పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. అదనంగా ఖర్చులు ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 21, 2024 / 08:09 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రవిగయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన యోగం ఏర్పడనుంది. మరికొన్ని రాశుల వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. ఈ నేపథ్యంలో మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఉద్యోగులు కార్యాలయంలో బాధ్యాతాయుతంగా పనిచేయాలి. ప్రియమైన వారితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఏదైనా గొడవ జరిగితే అందులో తలదూర్చకుండా ఉండాలి. అనుకున్న పనులు నెరవేరుతాయి.

    వృషభ రాశి:
    కొత్త ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. పెండింగులో ఉన్న డబ్బు చేతికి వస్తుంది.

    మిథున రాశి:
    పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. అదనంగా ఖర్చులు ఉంటాయి.

    కర్కాటక రాశి:
    నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు భవిష్యత్ కు సంబంధించి ప్రణాళిక వేస్తారు. విదేశాలత్లో ఉండే విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు.

    సింహారాశి:
    ఈ రాశి ఉద్యోగులకు శత్రువుల బెడద ఉంటుంది. కాబట్టి కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వాదనలకు దూరంగా ఉండాలి.

    కన్య రాశి:
    వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఏదైనా ఆస్తి ని కొనాలని అనుకుంటే ఇతరులను సంప్రదించాలి. వివాహానికి కొన్ని అడ్డంకులు ఏర్పడుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    తుల రాశి:
    కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండలి.

    వృశ్చిక రాశి:
    అనుకున్న పనులు నెరవేరుతాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి కొంత సమాచారం అందుతుంది.

    ధనస్సు రాశి:
    కొన్ని పనులను సులభంగా చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటి వారితో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

    మకర రాశి:
    వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ఫుల్ సపోర్టు ఉంటుంది. ఏ పని చేపట్టినా దానిని తొందరగా పూర్తి చేస్తారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.

    కుంభరాశి:
    కొన్ని సుఖాలకు దూరంగా ఉండాలి. పనులన పెండింగులో ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    మీనరాశి:
    ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారానికి కొత్త ఊపు వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. సాయంత్రం కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.