https://oktelugu.com/

Vikram vs Surya : విక్రమ్ vs సూర్య తమిళ్ ఇండస్ట్రీ లో ఏం జరుగుతోంది..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటారు. అయితే కొంతమందికి మాత్రం చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. అందుకోసమే వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా చూడడానికి యావత్ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు

Written By:
  • Gopi
  • , Updated On : October 21, 2024 / 08:06 AM IST

    Vikram vs Surya What is happening in the Tamil industry..?

    Follow us on

    Vikram vs Surya : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కమల్ హాసన్, రజినీకాంత్ లకు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. వీళ్లిద్దరూ చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు వీళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలను చేస్తున్నందుకు గాను వాళ్ళు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంటున్నారు. ఇక రీసెంట్ గా కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాతో నిరాశపరిచినప్పటికి మరోసారి భారతీయుడు 3 సినిమాని లైన్ లో పెడుతూన్నాడు. అలాగే రజనీకాంత్ కూడా రీసెంట్ గా వేట్టయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయినప్పటికి ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేదు. ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న కూలీ సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలను అందుకునే విధంగా ముందుకు దూసుకెళ్లిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని అందుకుంటే ఈతన పేరు మరోసారి పాన్ ఇండియా వైడ్ గా చాలా పెద్ద స్థాయిలో వినిపిస్తుంది… ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత విక్రమ్, సూర్య లు అంత మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
    ఇక తమిళ్, తెలుగు రెండు ఇండస్ట్రీల్లో కూడా వీళ్లకు చాలా మంచి మార్కెట్ అయితే ఉంది. రీసెంట్ గా విక్రమ్ తంగలన్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా అందించిన సక్సెస్ తో విక్రమ్ మరోసారి భారీ ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నాడు. సూర్య కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
    దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాతో ఆయన ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కనక సక్సెస్ ని సాధిస్తే సూర్య కూడా పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతాడు అయితే ఇప్పుడు సూర్య విక్రమ్ మధ్య భారీ ఫైట్ అయితే జరుగుతుందన్న విషయం మనకు తెలిసిందే వీళ్లిద్దరూ ముఖ్యంగా తమిళ్ స్టార్ లైన కూడా టాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
    తంగలాన్ సినిమాతో విక్రమ్ కొంతవరకు మెప్పించినప్పటికి కంగువా సినిమాతో సూర్య మెప్పిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. రజినీకాంత్, కమల్ హాసన్ ల తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న హీరోలు కూడా వీళ్లే కావడం విశేషం…మరి వీళ్ళిద్దరిలో పాన్ ఇండియా స్టార్లుగా ఎవరు అవతరిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…