Horoscope Today: త్రిపుష్కర యోగం కారణంగా ఈ నాలుగు రాశులకు ఆకస్మిక ధన లాభం..

వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం అదనపు భారం పడుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సోమరితనాన్ని వదులుకోకపోతే నష్టాలు తప్పవు.

Written By: Chai Muchhata, Updated On : August 21, 2024 8:03 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధవారం ద్వాదశ రాశులపై పూర్వభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. సూర్యుడు సింహా రాశిలో సంచరించనున్నాడు. ఈరోజు త్రిపుష్కర యోగం, సుకర్మ యోగం. ఈ కారణంగా కొన్ని రాశుల వారు ఆకస్మికంగా లాభాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు నష్టాలను ఎదుర్కొంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి:
ఈరాశి వ్యాపారులు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొన్ని కారణాల వల్ల డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. భవిష్యత్ కోసం కొన్ని పెట్టుబడులు పెడుతారు.

వృషభ రాశి:
కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వియార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

మిథున రాశి:
రాజకీయాకు సంబంధించిన వారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి:
వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం అదనపు భారం పడుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సోమరితనాన్ని వదులుకోకపోతే నష్టాలు తప్పవు.

సింహారాశి:
కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహానికి సంబంధించి కొన్ని ప్రయత్నాలు తీవ్రతరం చేస్తారు. ఆదాయం పెరుగుతున్నా ఖర్చులు పెరుగుతాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి.

కన్య రాశి:
ప్రభుత్వ ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. దీంతో ప్రమోషన్ పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. కొత్త ఆస్తిని కొనుగోలు చేసే ముందు పెద్దల సలహా తీసుకోవాలి.

తుల రాశి:
ఆదాయం పెరుగుతుంది. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల్లో ఒకరికి డబ్బు సాయం చేస్తారు.

వృశ్చిక రాశి:
విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఇతరులకు సాయం చేయడం వల్ల ఆత్మసంతృప్తి చెందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

ధనస్సు రాశి:
కుటుంబ సభ్యులతో గొడవలు రావొచ్చు. కొంతమంది శత్రువులతో నష్టాలు ఉంటాయి. ప్రసంగాల ద్వారా కొందరిని ఆకట్టుకుంటారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది.

మకర రాశి:
విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. వ్యాపారులు ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి:
ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. వ్యాపారం సాఫీగా సాగడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మీనరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. కుటుంబ సభ్యుల మధ్య చీలికలు ఏర్పడవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.