Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 6న ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. బుధవారం చంద్రుడు ధనస్సు రాశిలో సంచరించనున్నాడు. దీంతో కర్కాటక రాశివారికి వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయాల్లో కొనసాగేవారికి ప్రయోజనాలు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఈ విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి.
వృషభ రాశి:
ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని సమయాలో అసౌకర్యంగా ఉంటాయి. శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. పెండింగు పనులు పూర్తి చేస్తారు.
మిధునం:
ఇంటి మరమ్మతుల విషయంలో బిజీగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో వివాదం నెలకొంటుంది.
కర్కాటకం:
పెళ్లికాని వారికి వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. ఇతరుల వద్ద ఉన్న మీ డబ్బు మీ దరికి చేరుతుంది. విద్యార్థులు ఈరోజు నుంచి చదువుపై ఆసక్తి చూపుతారు.
సింహ:
ఈ రాశి వారికి ఈరోజు ఆలోచనాత్మకంగా మెదులుతారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఇతరులను సంప్రదించాలి. ఉద్యోగులకు ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది.
కన్య:
సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారుల పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
తుల:
కుటుంబ బాధ్యతల విషయంలో ఆందోళనగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో తోటి వారితో వివాదం ఉంటుంది. ఎక్కువగా వాదనలు చేయకుండా ఉండడం మంచిది.
వృశ్చికం:
అప్పు కావాలంటే సులభంగా అందుతుంది. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.
ధనస్సు:
ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆస్తుల విషయంలో వాదనలకు దిగొద్దు.
మకర:
వ్యాపారుల వృత్తి పరమైన పర్యటనలు ఉంటాయి. ఒక పని పూర్తి కావడానికి ఎక్కువగా కష్టపడుతారు. స్నేహితులతో విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
కుంభం:
వ్యాపారులు కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో పూర్తి మద్దతు ఉంటుంది. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు.
మీనం:
విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితుడి ఆరోగ్యం గురించ ఆందోళన చెందుతారు. ప్రత్యేక పనుల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు.