Horoscope Today: ఈరోజు ద్వాదశ రాశులపై శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు.ఈరోజు శని ప్రదోషం. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి:
కుటుంబంతో కలిసి బిజీగా ఉంటారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో వాదనలు ఉంటాయి.
వృషభ రాశి:
జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుుంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఇంటి వారీ అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి.
మిథున రాశి:
సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార కార్యాకలాపాలు పెంచుకుంటారు. ఉద్యోగులకు సీనియర్ అధికారుల మద్దతు ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు.
కర్కాటక రాశి:
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో బిజీగా ఉంటారు. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెడుతారు. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
సింహారాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రయాణం మొదలు పెడుతారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉన్నత విద్య చేసేవారు శుభవార్తలు వింటారు.
కన్య రాశి:
ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో సరదాగా ఉంటారు. ఇంటి నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకుంటారు.ఉద్యోగులుకు శ్రమ పెరుగుతుంది. వ్యాపారులు కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు.
తుల రాశి:
కొందరికి శత్రువుల బెడద ఉంటుంది. అందువల్ల ఎటువంటి రహస్యాలు బయటపెట్టొద్దు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వివాహ ప్రతిపాదనలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
వ్యాపారంలో కొత్త పెట్టుబుడులు పెడుతారు. వీరికి కటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
ధనస్సు రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం స్నేహితులను కలుస్తారు. వ్యాపారులు కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు.
మకర రాశి:
కుటుంబ సభ్యులతో వాదనలు ఉంటాయి. వివాహ ప్రతిపాదలను వస్తాయి. విద్యార్థుల కెరీర్ కుసంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు శ్రమ అధికంగా ఉంటుంది. అయినా అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.
కుంభరాశి:
బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టుకు మొదలుపెడుతారు. ఉద్యోగులు బాధ్యతుల పూర్తి చేయడంతో ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ పై కొన్ని శుభవార్తలు వింటారు.
మీనరాశి:
భవిష్యత్ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు కొంత మేరకు ఒత్తిడిని ఎదుర్కొంటారు. సీనియర్ల సలహాతో ప్రశాంతంగా మారుతారు.