Devara: #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో ‘దేవర’ చిత్రం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. కొరటాల శివ కి ఈ చిత్రానికి ముందు ఆచార్య లాంటి ఘోరమైన డిజాస్టర్ ఉంది. ఇంత చెత్తగా ఈ సినిమాని కొరటాల శివ ఎలా చేసాడు?, అసలు నిజంగా ఆయనే దర్శకత్వం వహించాడా? వంటి సందేహాలు చూసిన ప్రతీ ప్రేక్షకుడికి కలిగింది. ఇక కొరటాల శివ పని అయిపోయింది, ఎన్టీఆర్ అంత పెద్ద పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి డైరెక్టర్ కి అవకాశం ఎలా ఇచ్చాడో అని అభిమానులు సైతం భయపడ్డారు. కానీ కొరటాల శివ ‘దేవర’ చిత్రాన్ని ఎంతో కసిగా తీసాడు అని ఈ సినిమా నుండి విడుదల అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తుంటే అర్థం అవుతుంది.
గత ఏడాది విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో ని చూసి ఫ్యాన్స్ తో పాటుగా ఇతర హీరోల అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఆచార్య లాంటి సినిమా తీసిన కొరటాల వెంటనే ఈ రేంజ్ సినిమా ఎలా తీసాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట సెన్సేషనల్ హిట్ అయ్యింది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ పాటనే వినపడుతూ ఉండేది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘చుట్టమల్లే’ లిరికల్ వీడియో సాంగ్ కూడా బంపర్ అయ్యింది. రోజురోజుకి ఈ పాటకి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ పెరుగుతూ పోతున్నాయి. ఈ పాట విడుదలై కేవలం 11 రోజులు మాత్రమే అయ్యింది. ఈ 11 రోజులకు గానూ యూట్యూబ్ లో 5 భాషలకు కలిపి 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఒక్క తెలుగులోనే 69 మిలియన్ వ్యూస్ రాగా, హిందీ లో 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే తమిళం మలయాళం మరియు కన్నడ భాషలకు కలిపి ఓవరాల్ గా 100 మిలియన్ వ్యూస్ ఈ పాటకి వచ్చాయి. ఎన్టీఆర్ కెరీర్ లో ఈ మధ్య కాలం లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ ఆల్బం రాలేదు. త్వరలోనే ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్న ‘ఆయుధ పూజ’ పాటని విడుదల చెయ్యబోతున్నారు.
ఈ పాట ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలకు మించి ఉంటుందని, సౌత్ ఇండియా మొత్తం మారుమోగిపోయ్యే రేంజ్ లో హిట్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. ఈ పాట తో పాటుగా విలన్ సైఫ్ అలీ ఖాన్ మీద కూడా ఒక పాట ఉంటుంది. ఇది కూడా వచ్చే వారం లో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. విడుదలకు ముందే దేవర లో ఎలాంటి కంటెంట్ ఉండే కొరటాల శివ చూపించేసి అంచనాలను పెంచేసాడు. మరి ఆ అంచనాలను అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 27 వ తేదీ వరకు ఆగాల్సిందే.