https://oktelugu.com/

Horoscope Today: ఈ రెండు రాశులపై శని ప్రదోష ప్రభావం…ఈరోజంతా ఉల్లాసమే..

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మనసులో ఆందోళన పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 31, 2024 / 07:58 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని వారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఈరోజు శని ప్రదోష కారణంగా మిథున, కర్కాటక రాశి వారికి అనుకూల ప్రయోజనాలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు సీనియర్ అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వారితో గొడవలు ఉండే అవకాశం. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

    వృషభ రాశి:
    ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు శుభవార్తలు వింటారు. వ్యక్తిగతంగా సంబంధాలు మెరుగుపడుతాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.

    మిథున రాశి:
    వ్యాపారులు చేపట్టిన ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. తండ్రి సలహా మేరకు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు.

    కర్కాటక రాశి:
    శుభకార్యక్రమాలకు హాజరవుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. పాత స్నేహితులను కలుస్తారు. ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు.

    సింహారాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మనసులో ఆందోళన పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    కన్య రాశి:
    ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. అయితే కొత్త వ్యక్తులను నమ్మొద్దు.

    తుల రాశి:
    ఆస్తికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు.

    వృశ్చిక రాశి:
    ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. కుటుుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. విద్యార్థులు కొన్ని ఒత్తిడులు ఎదుర్కొంటారు.

    ధనస్సు రాశి:
    ఈ రాశి వారు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకునే టప్పుడు భాగస్వామితో ఒప్పందం చేసుకోవాలి.

    మకర రాశి:
    పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామిసలహా తీసుకుంటారు. ఒత్తిడి కారణంగా ఆందోళన పెరుగుతుంది. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    కుంభరాశి:
    ఈ రాశి వారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన వాతావరణం. ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మాటలను అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది.

    మీనరాశి:
    సాయంత్రం శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఏదైనా రిస్క్ తీసుకుంటే దానికి అనుగుణంగా ప్రయోజనాలు పొందుతారు. అనుకోని విధంగా లాభాలు పొందుతారు.