https://oktelugu.com/

Pregnancy : సిజేరియన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే?

మానసికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి. ఏ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో.. వాటి గురించి ఆలోచించడం మానేయాలి. ఆ సమయంలో ఒంటరిగా ఉండకుండా కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తే మీరు బయటపడతారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 31, 2024 / 07:35 AM IST

    Pregnancy

    Follow us on

    Pregnancy : తల్లి కావడమనేది గొప్ప వరం. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచే మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అప్పట్లో ఎక్కువగా సాధారణ డెలివరీలు అయ్యేవి. కానీ ప్రస్తుతం ఎక్కువగా సిజేరియన్ డెలివరీలు అవునన్నాయి. కొంతమంది అయితే ప్రస్తుతం ముహూర్తాలు చూసుకుని మరి సిజేరియన్ చేయించుకుంటున్నారు. నార్మల్ డెలివరీ అయితే కొన్ని రోజులకే ఫ్రీ అయిపోతారు. కానీ సిజేరియన్ అలా కాదు. దీని తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. అలాగే కోలుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. అయితే సిజేరియన్ తర్వాత మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.

    సిజేరియన్ తర్వాత మహిళలు చాలా విశ్రాంతి తీసుకోవాలి. బరువు గల వస్తువులు మోయకూడదు. సిజేరియన్ అయిన కొన్ని రోజుల వరకు నొప్పి, వాపు ఉంటాయి. వీటిని తగ్గించుకోవడానికి డాక్టర్ ఇచ్చే మందులను వాడాలి. కోత ప్రాంతంలో అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కాస్త అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. కొంతమందికి చీము కారడం వంటివి జరుగుతాయి. వీటివల్ల ఇన్ఫెక్షన్ సోకుతుంది. వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు, తృణధాన్యాలు, డ్రైఫూట్స్ వంటివి తీసుకోవడంతో పాటు వాటర్ ఎక్కువగా తాగుతుండాలి. కెఫిన్ వంటి పదార్థాలు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఎక్కువగా పండ్లు, జ్యూస్‌లు, రాజ్మా, ఆకుకూరలు, శనగలు, ఉలవలు వంటివి తీసుకోవాలి.

    చాలామంది మహిళలకు డెలివరీ తర్వాత మలబద్దకం సమస్య వస్తుంది. దీనిని నయం చేయడం కోసం ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే హెర్బల్ టీ, కొబ్బరి నీరు, పుదీనా టీ, గ్రీన్ టీ వంటివి తాగుతుండాలి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్‌ జోలికి అస్సలు వెళ్లకండి. సిజేరియన్ జరిగిన నెల రోజుల తర్వాత నడిచే ఓపిక ఉంటే.. వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. చాలామంది మహిళలు డెలివరీ తర్వాత ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడతారు. వీటి నుంచి విముక్తి పొందాలంటే యోగా, వ్యాయామం వంటివి తప్పనిసరి. అలాగే జీన్స్, లెగ్గింగ్స్ వంటి టైట్ దుస్తులు వేసుకోకూడదు. కొన్ని రోజులు భార్యాభర్తలు కలయికలో పాల్గొనకపోవడం మంచిది. దాదాపు కొన్ని నెలలు అయిన దూరంగా ఉండే బెటర్.

    కొంతమంది డెలివరీ తర్వాత వ్యక్తిగత సమస్యల వల్ల బాధపడుతూ పిల్లలను సరిగ్గా చూసుకోరు. అలాగే వాళ్ల ఆరోగ్యం కూడా చూసుకోరు. సరైన సమయానికి తినరు, నిద్రపోకపోవడం వంటివన్నీ చేస్తుంటారు. దీనివల్ల తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. మానసికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి. ఏ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో.. వాటి గురించి ఆలోచించడం మానేయాలి. ఆ సమయంలో ఒంటరిగా ఉండకుండా కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తే మీరు బయటపడతారు.