https://oktelugu.com/

Google Pay: కస్టమర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లు.. వాటి వల్ల ఉపయోగాలు ఏంటంటే..

డిజిటల్ విధానంలో చెల్లింపులను మరింత వేగంగా చేసేందుకు గూగుల్ పే సరికొత్త ప్రణాళికలు అమలు చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో గూగుల్ యాజమాన్యం ఈ వివరాలను వెల్లడించింది.

Written By: , Updated On : August 31, 2024 / 08:09 AM IST
Google Pay

Google Pay

Follow us on

Google Pay: కస్టమర్ల కోసం యూపీఐ సర్కిల్, యూపీఐ ఓచర్, క్లిక్ పే క్యూఆర్ స్కాన్, ప్రీపెయిడ్ యుటిలిటీ, రూపే కార్డుతో చెల్లింపు, యూపీఐ లైట్ కోసం ఆటో పే ట్ వంటి సాలభ్యాలను కస్టమర్ల కోసం తీసుకొచ్చింది.

యూపీఐ సర్కిల్

యూపీఐ సర్కిల్… సొంత బ్యాంక్ ఖాతాలకు యాక్సెస్ లేని వారు డిజిటల్ చెల్లింపులు చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. కస్టమర్లు తమ సొంత బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయాల్సిన అవసరం లేకుండానే కుటుంబ సభ్యులు లేదా దగ్గర స్నేహితులకు నగదు చెల్లింపులను చేసేందుకు ఈ సదుపాయం అవకాశం కల్పిస్తుంది.

యూపీఐ ఓచర్స్

మొబైల్ నెంబర్ కు అనుసంధానం చేసిన ప్రీపెయిడ్ ఓచర్లు యూజర్లకు మెరుగైన చెల్లింపు విధానం గా ఉంటాయి. వీటిని బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాల్సిన అవసరం లేకుండానే వివిధ లావాదేవీలు నిర్వహించవచ్చు. వాటి ద్వారా వ్యక్తులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ సంస్థలకు చెల్లింపులను డిజిటల్ విధానంలో సులభంగా చేసుకోవచ్చ. యూపీఐ ఓచర్లు అందుబాటులో ఉండేందుకు గూగుల్ పే కు ఎన్పీసీఐ ఆర్థిక సేవలు విభాగం సహకారం అందిస్తోంది.

క్యూఆర్ చెల్లింపులు

యూజర్లు తమ చెల్లింపులను మరింత వేగవంతంగా చేపట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత్ బిల్ పే సహకారంతో క్లిక్ పే క్యూఆర్ సదుపాయం తీసుకొచ్చింది. దీని ద్వారా కస్టమర్లు ఖాతా వివరాలు లేని వినియోగదారుల. ఐడీలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. వేగవంతంగా, సురక్షితంగా చెల్లింపులను ఇది ఎనేబుల్ చేస్తుంది.

ప్రీ పే యిడ్ విధానంలో యుటిలిటీస్ చెల్లింపు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత్ బిల్ పే సహకారంతో గూగుల్ పే ప్రీపెయిడ్ యుటిలిటీలకు సహకారం అందిస్తుంది.. ఫ్యూయల్ అకౌంట్లు, హౌసింగ్ సొసైటీల వంటి వాటికి రిపీటెడ్ బిల్స్ చెల్లించేందుకు ఇది ఉపయోగపడుతుంది.. కస్టమర్ల చెల్లింపు విధానాన్ని మరింత వేగవంతం చేయడంలో ఇది సహకరిస్తుంది.

రూపే ట్యాప్ చెల్లింపులు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో గూగుల్ పే రూపే కార్డుల కోసం ట్యాప్ & పే చెల్లింపు విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. భౌతికపరమైన కార్డు అవసరం లేకుండానే గూగుల్ పే ద్వారా తమ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వినియోగదారులు రూపే కార్డులతో చెల్లింపులు చేసేందుకు ఈ ఫీచర్ ఉపకరిస్తుంది..

యూపీఐ లైట్

వాలెట్లో కనీస నగదు నిలువలు నిర్దిష్టమతానికంటే తక్కువగా ఉన్నప్పుడు. యూపీఐ లైట్ ఉపయోగపడుతుంది. యూపీఐ లైట్ ఎకౌంట్ల కోసం గూగుల్ పే తన ఆటోమేటిక్ టాప్ అప్ ఫీచర్ ను అనుసంధానం చేసింది. ఇది వినియోగదారులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది. యూపీఐ లైట్ ద్వారా వ్యాలెట్ బ్యాలెన్స్ తగ్గకుండా చూసుకునే అవకాశం ఉంటుంది.