https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేపట్టినా విజయమే..

Horoscope Today ఇతరులకు డబ్బు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటికి చుట్టాలు రావడంతో సందడిగా ఉంటుంది. పా త స్నేహితులను కలుస్తారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 25, 2024 / 08:05 AM IST

    Horoscope

    Follow us on

    Horoscope Today: 2024 జూన్ 25 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు లక్ష్మీనారాయణ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల వాతావరణం ఉండనుంది.

    మేష రాశి:
    పిల్లల వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు శత్రువుల బెడద ఉండే ప్రమాదం ఉంది.

    వృషభ రాశి:
    ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. న్యాయ సంబంధిత విషయాల్లో విజయ సాధిస్తారు.జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    మిథున రాశి:
    ఆర్థికంగా పుంజుకుంటారు. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. వ్యాపార భాగస్వాముల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. విద్యార్థులు కెరీర్ గురించి ఆలోచిస్తారు.

    కర్కాటక రాశి:
    శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం. విదేశాల నుంచి వ్యాపారం చేసేవారికి కొత్త పెట్టుబడులు పెడుతారు. పెండింగులో ఉన్న బకాయిలు వసూలవుతాయి.

    సింహారాశి:
    తల్లిదండ్రుల సలహాతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వివాహానికి అర్హులైన వారికి సంబంధాలు వస్తుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

    కన్య రాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మహిళా ఉద్యోగులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. విద్యార్థులు టెక్నాలజీ స్టడీపై ప్రత్యేక ఫోకస్ చేస్తారు.

    తుల రాశి:
    పెండింగు పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తిని కొనుగోలు చేయాలనుకునేవారి ప్రయత్నాలు మొదలవుతాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    వృశ్చిక రాశి:
    ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. అన్నిరంగాల్లో ప్రశంసలు పొందుతారు. జీవితం ఉల్లాసంగా గడుస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారానికి సంబంధించి ఇతరుల సలహా తీసుకోవాలి.

    ధనస్సు రాశి:
    ఖర్చులు పెరుగుతాయి. పెండింగు సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

    మకర రాశి:
    ఇతరులకు డబ్బు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటికి చుట్టాలు రావడంతో సందడిగా ఉంటుంది. పా త స్నేహితులను కలుస్తారు.

    కుంభరాశి:
    రాజకీయాల్లో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రత్యర్థులు వేధించడానికి రెడీ అవుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు తోటి వారితో సమానంగా ఉండాలి.

    మీనరాశి:
    వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికలు వేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. తల్లిదండ్రుల నుంచి గౌరవం పొందుతారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది.