Junior NTR: నందమూరి మూడో తరం హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మొదటి సినిమాతోనే ఒక భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. ఇక ఇలా మొదటి సినిమాతోనే ప్లాప్ వస్తె మరొకరు అయితే ఇండస్ట్రీ మనకు పనికి రాదు అనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ నుంచి బయటికి పోతారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇక్కడ ఎలాగైనా సరే నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేశాడు.
కాబట్టి ఆ తర్వాత చేసిన స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి లాంటి సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకొని మాస్ హీరోగా కూడా ఎదిగాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఆయనకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఆయన లాంటి హీరో మరొకరు లేరు అనేలా గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇక నిజానికి కొన్ని సీన్లలో ఆయన లాగా నటించే నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక అన్నింట్లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ కొన్ని సీన్లను చేయడంలో తను చాలా వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని సీన్లు ఆడియన్స్ ని అంతగా మెప్పించలేకపోతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అవి ఏంటి అంటే రొమాంటిక్ సీన్లలో ఎన్టీఆర్ అంత బాగా పర్ఫార్మ్ చేయలేడు. యాక్షన్ మిగిలిన వాటన్నింటిలో చాలా బాగా నటించిననప్పటికీ ఒక రొమాంటిక్ సీన్స్ లలో మాత్రం ఆయన కొంత వరకు వీక్ గా కనిపిస్తున్నాడంటూ సినిమా విమర్శకులు సైతం చాలాసార్లు ఎన్టీఆర్ నటనలో ఈ విషయం గురించి తెలియజేశారు.
ఇక విమర్శకులు చెప్పిన విషయాన్ని తను ఇప్పటి వరకు కొంచెం అధిగమించినప్పటికీ ఫుల్ గా మార్చుకునే ప్రయత్నం అయితే చేయడం లేదంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కాబట్టి తను ఫ్యూచర్ లో ఒక రొమాంటిక్ సినిమాను చేసైనా అందులో కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసి తన మీద ఉన్న బ్యాడ్ నేమ్ ను తొలగించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…