Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కి మించి జగన్ కు భద్రత!

YS Jagan: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కి మించి జగన్ కు భద్రత!

YS Jagan: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు దారుణ భద్రత ఉంటుంది. ఆయన నిత్యం తాను ఉండే ప్రదేశాలను మారుస్తుంటారు. ఎన్నో అంచల భద్రత వ్యవస్థను నిర్మించారు. ప్రపంచ దేశాల్లో ఏ అధ్యక్షుడికి లేనంత భద్రతా వలయంలో నిత్యం ఉంటారు. ఆ సరసన చేరారు ఏపీ మాజీ సీఎం జగన్. నిన్నటి వరకు ఏపీ సీఎం గా వ్యవహరించిన ఆయన భద్రతకు ఎంత మంది పోలీస్ సిబ్బంది ఉండేవారో తెలుసా? అక్షరాల 986 మంది. కేవలం ఇంట్లోనే ఉంటేనే ఎంతమంది భద్రత ఉండేవారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెడితే వారి సంఖ్య రెండు నుంచి మూడింతలు ఉండేది. ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకి రూ. 296 కోట్లు. ప్యాలెస్ చుట్టూ అడుగడుగునా తనిఖీలు.. అత్యాధునిక రక్షణ పరికరాలు వినియోగించేవారు. తాడేపల్లి చుట్టూ పదుల సంఖ్యలో చెక్పోస్టులు ఏర్పాటు చేసేవారు. చుట్టుపక్కల ఏళ్ల పై నిత్యం డ్రోన్ కెమెరాలు తిరిగేవి. అయితే ఇప్పుడు ఆయన మాజీ అయ్యారు. అయినా సరే అదే భద్రత కొనసాగుతూ ఉండడం విశేషం. రెండు బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయుజర్ కార్లు ఇప్పటికీ ఆయన వద్దే ఉన్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మామకు దగ్గరగా జగన్ మామ ఉండడం విశేషం.

దేశంలో రాష్ట్రపతి,ప్రధాని,ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జెడ్ ప్లస్ కేటగిరి లో ఉండే వారి ఇల్లు వద్ద కూడా ఈ స్థాయి భద్రత కనిపించదు.నిత్యం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ310 మంది రక్షణలో ఉంటారు. మూడు షిఫ్టుల్లో కలిపి ఆ సంఖ్య 934. తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్నవారు తమ ఇళ్లకు వెళ్లాలన్న మెడలో గుర్తింపు కార్డులు వేసుకోవాల్సిందే. అడుగడుగునా ఆపే పోలీసులకు తమ రుజువులను చూపించాల్సిందే. ప్రముఖులు ఎవరైనా సీఎం ను కలవడానికి వస్తే గంటల తరబడివేచి ఉండాల్సిందే. ఇక రయ్ రయ్ మంటూ డ్రోన్లు నిత్యం తిరుగుతుంటాయి. అయితే ఈ తరహా భద్రతఒక సీఎం స్థాయికి మించి ఉండడం ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.గతంలో మాదిరిగా మావోయిస్టుల కార్యకలాపాలు లేవు. తీవ్రవాదుల ఆనవాళ్లు లేవు. అయితే ఎవరి నుంచి జగన్ కు ముప్పు. రాజకీయ ప్రత్యర్థులకు అంత సీన్ లేదు. ఇక ఉన్నదంతా ప్రజల నుంచి ఆ భయం. లేనిపోని హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంతో ప్రజలు తిరగబడతానన్న భయంతోనే ఈ భద్రత ఏర్పాటు చేసుకున్నారేమో.

జగన్ నివాసం చుట్టూ పదుల సంఖ్యలో చెక్ పోస్టులు ఉంటాయి. కేవలం ప్యాలెస్ చుట్టూనే కాదు. ఉండవల్లి గుహలు, సీతానగరం, వారధి, ప్రకాశం బ్యారేజీ సహా అడుగడుగునా చెక్ పోస్టులే. ఒక్కోచోట 10 నుంచి 16 మంది పోలీసులు విధులు నిర్వహిస్తుంటారు. మీరు కాకుండా ట్రాఫిక్ విధుల్లో సుమారు 30 మంది వరకు ఉంటారు. ఇక సీఎం రక్షణలో నిమజ్జనం అయ్యే బాంబు స్క్వాడ్, యాంటీ నక్సల్స్ స్క్వాడ్ బృందాలు ఆదనం. ఎస్ ఎస్ సి బలగాలు కాకుండా, చెక్ పోస్టులు, ఇతర బాధ్యతల్లో ఉండేవారు 55 మంది. దేశంలో మరే సీఎంకు లేని స్థాయిలో జగన్ కు ప్రభుత్వం రక్షణ కల్పించింది. దీనికోసం ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఆక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చింది. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 379 మంది ఎస్ ఎస్ జి సిబ్బంది నిరంతరం ఆయన భద్రతలో నిమగ్నమై ఉంటారు. వీరు కాకుండా 491 మంది ఇతర దళాలు, నూట పదహారు మంది ఇతరత్రా విధులు నిర్వహిస్తుంటారు. ఒక్క సీఎం జగన్ కే కాదు ఆయన భార్య భారతికి నలుగురు, తల్లి విజయమ్మకు నలుగురు చొప్పున భద్రతా సిబ్బంది ఉంటారు. తాడేపల్లి ప్యాలెస్ తో పాటు లోటస్ పాండ్, ఇడుపులపాయ, పులివెందుల ఇళ్ల వద్ద కూడా 52 మంది పోలీసులు నిరంతరం రక్షణ కల్పిస్తుంటారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని అసాధారణ భద్రత జగన్ కొనసాగించడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version