Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 5న ద్వాదశ రాశులపై అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. సోమవారం చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ఓ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారికి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారికి ఈరోజుకు పని భారం పెరుగుతుంది. మానసికంగా ఇబ్బందిని కలిగి ఉంటారు. జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. కొన్ని రంగాల వారికి ఆకస్మికంగా అదృష్టం వస్తుంది.
వృషభ రాశి:
ఆర్థిక నష్టాలు ఉండే అవకాశం. మానసికంగా నిరాశతో ఉంటారు. ముఖ్యమైన పనులను చేపడతారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో సంయమనం పాటించాలి.
మిథునం:
వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు ఇతరులను సంప్రదించాలి. కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. ఆదాయం బాగానే ఉంటుంది. పరిశ్రమల్లో పనిచేసే వ్యక్తులు తోటి ఉద్యోగులతో సంయమనం పాటించాలి. మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి.
కర్కాటకం:
ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు తోటి వారితో సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు.
సింహ:
జీవిత భాగస్వామితో వాగ్వాదాలు ఉంటాయి. వృథా ఖర్చులను నియంత్రించాలి. మీపై ఆధిపత్యానికి కొందరు ప్రయత్నిస్తారు. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక నష్టాలు ఉంటాయి.
కన్య:
ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వేడుక కోసం బిజీగా మారుతారు. విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపాలి. వివిధ రంగాల వారు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.
తుల:
ఈ రాశి వారికి ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఇతరులకు మాటివ్వద్దు. ఉద్యోగులు తోటి వారితో వాదనలకు దిగొద్దు. వ్యాపారులకు లాభదాయకం.
వృశ్చికం:
ఈరోజు ఈ రాశి వారికి మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. ఇతరులతో ఎక్కువగా మాట్లాడవద్దు. లేకుంటే నష్టాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
ధనస్సు:
ఈ రాశి వారికి అనుకోని ఆదాయం సమకూరుతుంది. అయితే వృథా ఖర్చులు పెరుగుతాయి. మంచి ఆలోచనలతో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పర్సనల్ విషయాలు ఇతరులతో పంచుకోకుండా ఉండడమే మంచిది. ప్రియమైన వారితో ఉల్లాసంగా ఉండాలి.
మకర:
ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చికాకు, అసౌకర్యానికి గురవుతారు. పనితీరుపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు సీనియర్ల నుంచి వేధింపులు ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి.
కుంభం:
గతంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అయితే తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోవద్దు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆలోచిస్తారు.
మీనం:
ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రియమైన వారితో విహారయాత్రకు వెళ్తారు. ఆఫీసుల్లో తోటి వారి మద్దతు ఉంటుంది. వ్యాపారులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు.