October 6 2023 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడంవల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో సహకారం ఉంటుంది. అలాంటి విషయాలను ఆస్ట్రాలజీ తెలుపుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 6న శుక్రవారం 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఉద్యోగం చేసేవారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. ఇంట్లో సౌకర్యంగా ఉంటారు. గతంలో వేసిన కొన్ని ప్రణాళికలు ఆగిపోతాయి.
వృషభం:
ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. సవాళ్లను ఎదుర్కొంటారు. విద్యార్థులు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన సమయం. ఈరోజు అనందంగా ఉండడానికి ప్రయత్నించండి
మిథునం:
కమ్యూనికేషన్ ను పెంచుకోవడానికి కాస్త చురుగ్గా ఉండాలి. ఆన్ లైన్ కోర్సులో పెట్టుబడి పెట్టడానికి అనుకూలం. భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. వ్యక్థిత్వాన్ని నిరూపించుకోవడానికి అనువైన సమయం.
కర్కాటకం:
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చంచల మనస్తత్వంతో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే గతంలో మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తారు.
సింహం:
అభివృద్ధికి అధికారుల సహకారం ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది.
కన్య:
ఇప్పటి వరకు వేధించిన ఓ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం. కొందరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కీలక పనుల్లో దృష్టి సారిస్తారు.
తుల:
ఉద్యోగ, వ్యాపారాల్లోని వారికి శ్రమ పెరుగుతుంది. ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
వృశ్చికం:
తొందరపాటుతో ఉండకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నా బంధుమిత్రులను సంప్రదించాలి. ఎక్కువగా మదన పడకుండా ఉండడి. కొన్ని ఖర్చులు పెరుగుతాయి.
ధనస్సు:
చేపట్టిన పనుల్లో ఆటంకం కలగకుండా చూసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం:
అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.మానసికంగా ప్రశాంతతను కలిగి ఉంటారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.
కుంభం:
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం చేసేవారు ఒత్తిడి లేకుండా గడపాలి. కుటుంబ సభ్యులకు పాజిటివ్ సంకేతాలు.
మీనం:
కొత్త పనులు చేపట్టే ముందు లక్ష్యంపై ప్రణాళిక వేయాలి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారం చేసేవారికి అనుకూలమైన రోజు.