Horoscope Today: హోలీ పండుగ నేపథ్యంలో ఆదివారం కాముడి దహనం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో వృశ్చిక రాశి వ్యాపరస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 24న ద్వాదశ రాశులపై ఉత్తర పాల్ఘుని నక్షత్ర ప్రభావం ఉంటుంది. 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. కొన్ని శుభవార్తలు వింటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి పొందుతారు.
వృషభ రాశి:
కొన్ని సంబంధాల విషయంలో సున్నితంగా ప్రవర్తించాలి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టే ముందు ఇతరుల సలహాలు తీసుకోవాలి. కొత్త వాహనం కొనుగోలుకు ఆసక్తి చూపుతారు.
మిథునం:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గతంలో జరిగిన తప్పులపై చర్చిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులపై ఆలోచిస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు.
కర్కాటకం:
విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆర్థిక అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతారు. వ్యాపార విషయంలో ఇతరులపై ఆధారపడొద్దు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు.
సింహ:
ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. అనుభవాన్ని ఉపయోగించి కొన్ని పనులను విజయవంతంగా పూర్తపి చేస్తారు. కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తారు.
కన్య:
వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మరికొన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న ఆదాయం రావడంతో సంతోషంగా ఉంటారు.
తుల:
వ్యాపారస్తులు అనుకున్న ఓ పని నేడు నెరవేరుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో తోటివారి మద్దతు ఉంటుంది.
వృశ్చికం:
కాముడి పౌర్ణమి ఈ రాశి వారికి కలిసి వస్తుంది. దీంతో అధికంగా లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో సంతోషంగా ఉంటారు.
ధనస్సు:
నిరుద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు రావొచ్చు. కొన్ని పనుల కోసం ఒత్తిడి పెరుగుతుంది. అయినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
మకర:
పాత స్నేహితులను కలుస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఎక్కువగా వాదనలు చేయొద్దు ఓ రంగంలో వారు ఒత్తిడిని ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు పెండింగులో ఉంచొద్దు.
కుంభం:
ఈ రాశివారు ఈరోజు తొందరపడి ఏ పనులు చేయొద్దు. ఆస్తి సంబంధిత విషయాల్లో కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారు.
మీనం:
వ్యాపారస్తులు ఎవరినైనా సాయం కోరితే వెంటనే అందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెండింగులో ఉన్న పనులు నేటితో పూర్తవుతాయి.