Horoscope Today: ఆంజనేయుడి అనుగ్రహంతో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు..

Horoscope Today: 2024 జూన్ 11 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై అశ్లేష, మాఘ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : June 11, 2024 7:37 am

Hanuman Jayanthi.Horoscope jpg

Follow us on

Horoscope Today: 2024 జూన్ 11 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై అశ్లేష, మాఘ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ఆంజనేయుడి అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారికి వ్యతిరేక పవనాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభ రాశి:
ఈరాశి వారు ఈరోజు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు. తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

మిథున రాశి:
కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. నగదు కొరత కారణంగా ఇబ్బందులు ఏర్పడుతాయి. కుటుంబ సభ్యుల సలహాతో కొన్ని పనులు పూర్తవుతాయి.

కర్కాటక రాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టడంలో ప్రణాళికతో వ్యవహరిస్తారు. వ్యాపార ప్రయాణాలు ఉంటాయి. అనవసర ఖర్చుల జోలికి వెళ్లొద్దు.

సింహారాశి:
వ్యాపారులకు అనుకూలమైన మార్పులు ఉంటాయి. బాధ్యతలు మరింత పెరుగతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడుతారు. ఆరోగయంపై శ్రద్ధ వహించాలి.

కన్య రాశి:
నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరగుపడుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పనుల కోసం అదనంగా డబ్బు ఖర్చు చేయాలి.

తుల రాశి:
పెండింగు పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతతారు. పాత కోరికలను నెరవేర్చుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు ఉంటాయి.

వృశ్చిక రాశి:
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొత్త సంబంధాలు ఏర్పడుతాయి. దీంతో ఉత్సాహంగా ఉంటారు.

మకర రాశి:
అనవసర ఖర్చులు ఉంటాయి. పెద్దమొత్తంలో డబ్బు వచ్చి పడుతుంది. కొన్ని విషయాలపై సంతృప్తిగా ఉంటారు. గృహోపకరణాల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉంటారు.

కుంభరాశి:
ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఒత్తిడి నుంచి దూరంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనరాశి:
ఉద్యోగులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో పనిచేస్తారు.వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. మానసిక ప్రశాంతతో ఉంటారు.