Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 19న ద్వాదశ రాశులపై అర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. సోమవారం చంద్రుడు మిధున రాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటారు. మరి కొన్ని రాశుల వారికి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
విహార యాత్రకు వెళ్లాలనుకునేవారు ఆలోచించాలి. మీ ప్రవర్తన్ వల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని పనులు పెండింగులో పడొచ్చు.
వృషభ రాశి:
ముఖ్యమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో అలసత్వం వహించొద్దు. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం:
ఉద్యోగులు ఉన్నతాధికారులతో విమర్శలు ఎదుర్కొంటారు.పాత స్నేహితులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి.
కర్కాటకం:
వ్యాపారంలో ముందుకు వెళ్లేవారు ఇతరుల సలహాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.
సింహ:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను పొందుతారు. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితుడిని కలుస్తారు.
కన్య:
తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తుల:
ఫోన్లో ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపార అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగుల బదిలీలు ఉంటాయి. కొన్ని పనులు పెండింగులో పడొచ్చు.
వృశ్చికం:
కొత్త పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండాలి. కటుుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువ. ఓ ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
ధనస్సు:
కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉన్న పెట్టుబడులతో లాభాలు వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవచ్చు.
మకర:
ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయొద్దు. ఏ పని చేసినా ఆలోచనాత్మకంగా చేయాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థుల చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థులు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని బాధ్యతలు పెరుగుతాయి.
మీనం:
వ్యాపారులు కొన్ని మార్పులు చేస్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.